కరోనా సెకండ్ వెవ్ తగ్గి.. ప్రజలు సాధారణ జీవితానికి అలవాటు పడుతున్నారు. మళ్ళీ ఇప్పుడు కరోనా థర్డ్ వేవ్ పై రకరకాల కథనాలు మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కరోనా థర్డ్‌వేవ్ అక్టోబర్ నాటికి గరిష్ఠస్థాయికి చేరుకోవచ్చు.. పెద్దల వలే పిల్లలు కూడా కరోనా మూడో ముంపుకి ప్రభావితం కావొచ్చు.. ఇవి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటైన కమిటీ సూచనలు. నిపుణుల బృందం ఈ నివేదికను ప్రధానమంత్రి కార్యాలయానికి సమర్పించినట్లు ఓ వార్త సంస్థ కథనం పేర్కొంది.
ఒకవేళ చిన్నారులు భారీగా కరోనా బారిన పడి, ఆసుపత్రిలో చేరే పరిస్థితి తలెత్తితే.. వైద్యసిబ్బంది, వెంటిలేటర్లు, అంబులెన్సులు వంటి వైద్యసేవలు అవసరానికి తగ్గట్టుగా అందుబాటులో లేవు. అలాగే చికిత్స సమయంలో వైరస్ సోకిన పిల్లలతో ఉండే సంరక్షకులు సురక్షితంగా ఉండేలా కొవిడ్ వార్డుల నిర్మాణం ఉండాలి అని నిపుణుల బృందం ప్రతిపాదించింది.