థియేటర్స్ ఓపెన్ అవడంతో.. భారీ బడ్జెట్, రిలీజ్ కి రెడీ గా ఉన్న మూవీస్ అన్ని రిలీజ్ డేట్ లు ప్రకటించేస్తున్నాయి. కరోనా సెకండ్ వేవ్ కి ముందు రిలీజ్ కావాల్సిన నాగ చైతన్య లవ్ స్టోరీ సెప్టెంబర్ 10 వినాయక చవితి స్పెషల్ గా రిలీజ్ డేట్ ప్రకటించగా, ఇప్పుడు తమిళంలో జయలలిత బయో పిక్ గా తెరకెక్కిన తలైవి మూవీ ఎప్టెంబర్ 10 న రెడీ టు రిలీజ్ అంటుంది. ఎప్పుడో సెకండ్ వేవ్ కి ముందు ఏప్రిల్ 23 నే రిలీజ్ అవ్వాల్సి ఉండగా.. సెకండ్ వేవ్ తో థియేటర్స్ బంద్ అవడంతో.. తలైవి కూడా పోస్ట్ ఫోన్ అయ్యింది.
ఇక అన్ని రాష్ట్రాల్లో థియేటర్స్ ఓపెన్ అవడంతో కంగనా రనౌత్ తలైవి ని సెప్టెంబర్ 10 న వరల్డ్ వైడ్ గా థియేట్రికల్ రిలీజ్ చెయ్యబోతున్నట్టుగా మేకర్స్ ప్రకటించారు. కె. ఎల్ విజయ్ దర్శకత్వంలో అమ్మ జయలలితా గా కంగనా నటించిన ఈ బయోపిక్ కి టాప్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ కథ అందించారు. ఇప్పుడు సెప్టెంబర్ 10 న తనివి రేస్ లోకి రావడంతో.. ఆ రోజు రిలీజ్ పోటీ పెరుగుతూ వస్తుంది.