ఎప్పటినుండో కీర్తి సురేష్ చిరు కి చెల్లెమ్మగా తమిళ్ హిట్ మూవీ వేదాళం తెలుగు రీమేక్ లో నటిస్తుంది అంటూ ప్రచారం జరుగుతుంటే.. కీర్తి అభిమానులు ఒకింత కంగారు పడ్డారు. స్టార్ హీరోల మూవీస్ లో టాప్ హీరోయిన్ గా చూడాల్సిన కీర్తి సురేష్ ఇలా చిరు సిస్టర్ రోల్ లో నటించడం వాళ్ళకి సుతరామూ ఇష్టం లేదు. ప్రస్తుతం మహేష్ బాబు సర్కారు వారి పాటలో హీరోయిన్ గా నటిస్తున్న కీర్తి సురేష్.. వేదాళం రీమేక్ లో నటించదని అనుకున్నారు. కానీ నిన్న చిరు బర్త్ డే రోజున అందరికి షాకిస్తూ కీర్తి సురేష్ అన్నయ్య చిరుకి భోళా శంకర్ లో రాఖి కట్టెయ్యడం చూసిన అభిమానులు ఖంగు తిన్నారు. భోళా శంకర్ సినిమాలో అన్న - చెల్లెలి అనుబంధం కథతో ఈ సినిమా తెరకెక్కుతుంది. చిరు కేరెక్టర్ ఈ సినిమాకి ఎంత ఇంపార్టెంటో కీర్తి సురేష్ చెల్లెలి కేరెక్టర్ కూడా అంతే ఇంపార్టెంట్.
అయితే కీర్తి సురేష్ చేసిన ఈ సాహసానికి భోళా శంకర్ మేకర్స్ భారీగా సమర్పిస్తున్నారట. అంటే చిరు సిస్టర్ గా టాప్ హీరోయిన్ అంటే సినిమాపై భారీ క్రేజ్ ఉంటుంది కాబట్టి.. కీర్తి సురేష్ అడిగింది ఇవ్వడానికి మేకర్స్ ఒప్పేసుకున్నారట. హీరోయిన్ గా తెలుగు, తమిళ్ లో దాదాపుగా మూడు కోట్లు రెమ్యునరేషన్ అందుకుంటున్న కీర్తి కి భోళా శంకర్ రీమేక్ ని బట్టి పారితోషకం ఇవ్వబోతున్నారట మేకర్స్. అది కూడా భారీగా అంటూ ప్రచారం జరుగుతుంటే.. అందుకే కీర్తి కూడా ఒప్పేసుకుంది అని అంటున్నారు నెటిజెన్స్.