మా ఎన్నికలు ఈ ఏడాది మాంచి రసవత్తరంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రకాష్ రాజ్ - మంచు విష్ణు మద్యన ప్రధాన పోటీ ఉండగా.. హేమ, జీవిత, నరసింహారావు మధ్యన అంతమంత్రం పోటీ ఉంటుంది అనుకుంటే ఇపుడు మరో నటుడు మా అధ్యక్ష పదవికి సై అంటున్నాడు. అతనెవరో కాదు మేము సైతం కాదంబరి కిరణ్. త్వరలోనే మా ఎన్నికలు నిర్వహించాలంటూ చిరు కృష్ణం రాజుకి లేఖ రాసిన నేపథ్యంలో మా ఎలక్షన్స్ ఈసారి హాట్ హాట్ గా ఉండబోతున్నాయని అందరూ ఫిక్స్ అవుతున్నారు కూడా. అలాంటి టైం లో అధ్యక్ష పదవికి పోటీ పెరగడం మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది.
ప్రకాష్ రాజ్ మా అధ్యక్ష పదవి కోసం ఇప్పటికే ఇండస్ట్రీలోని చాలామందిని పోగేసేసారు. మరో పక్క మా అధ్యక్ష భవనం అంటూ మంచు విష్ణు కాక రేపుతున్నాడు. అలాగే హేమ ప్రస్తుతం అధ్యక్షుడిపై ఘాటైన వ్యాఖ్యలు చేస్తుంది. జీవిత, నరసింహారావు సైలెంట్ గా ఉండగా.. ఇప్పుడు కాదంబరి కిరణ్ లైన్ లోకొచ్చారు. ఆయన అధ్యక్షుడిగా గెలిచి తీరుతానని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
తనకి సినిమా ఆదాయం తప్ప మరె ఆదాయం లేదని, మాలో ప్రస్తుతం 900 వరకు సభ్యులున్నారు. ఎపుడు ఎన్నికలు జరిగానా.. 450 సభ్యులు మాత్రమే తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఈ ఎన్నికల్లో 450 ఓట్లలో 300 ఓట్లు ఖచ్చితంగా తనకే వేస్తారనే కాన్ఫిడెన్స్ తో ఉన్నానంటున్న. ఇది ఓవర్ కాన్ఫిడెన్స్ కాదని, మా అధ్యక్షుడిగా పోటీ చేసి గెలవడం పెద్ద విషయం కాదంటూ సంచలనంగా మాట్లాడారు.