Advertisementt

చిరు గాడ్ ఫాదర్ ఆగడానికి కారణం

Wed 25th Aug 2021 07:31 PM
chiranjeevi,godfather movie,malayala lucifer remake,god father shoot postponed,mohan raja,chiru,nirav shah  చిరు గాడ్ ఫాదర్ ఆగడానికి కారణం
Chiranjeevi Godfather shoot postponed చిరు గాడ్ ఫాదర్ ఆగడానికి కారణం
Advertisement
Ads by CJ

మెగాస్టార్ చిరు ఆచార్య షూటింగ్ ఫినిష్ కావడంతో.. మళ్ళీ చాలా స్పీడు గా మోహన్  దర్శకత్వంలో లూసిఫెర్ రీమేక్ గాడ్ ఫాదర్ షూటింగ్ లో జాయిన్ అయ్యారు. చిరంజీవి పై కీలక సన్నివేశాల చిత్రీకరణలో మోహన్ రాజా ఉన్నారు. ఈ సినిమాలో జబర్దస్త్ అనసూయ ఓ కీ రోల్ పోషిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతుంది. ఇక ఈ సినిమాలో చిరు కి రైట్ హ్యాండ్ గాను, బాడీ గార్డ్ గాను.. అలాగే చిరు తమ్ముడి కేరెక్టర్ లో చెయ్యబోయే హీరోలపై అందరిలో ఆశక్తి ఉంది. 

అయితే ఫుల్ స్వింగ్ లో గ్యాప్ లేకుండా షూటింగ్ జరుపుకుంటున్న గాడ్ ఫాదర్ షూటింగ్ కి తాజాగా బ్రేకులు పడినట్లుగా తెలుస్తుంది. హైదరాబాద్ లోని ఓ భారీ సెట్ లో షూటింగ్ మొదలు పెట్టిన గాడ్ ఫాదర్ షూటింగ్ ప్రస్తుతం ఆగినట్లుగా తెలుస్తుంది. అసలు గాడ్ ఫాదర్ సినిమా షూటింగ్ ఆగిపోవడానికి కారణం కూడా బయటకు వచ్చింది. అదేమిటంటే గాడ్ ఫాదర్ చిత్రానికి నీరవ్ షా కెమెరామెన్‌గా పని చేస్తున్నారు. అయితే ఆయన తమిళంలో అజిత్ హీరోగా తెరకెక్కుతున్న వాలిమైకు కూడా కెమెరామెన్‌గా పని చేస్తున్నారు. 

ప్రస్తుతం ఆయన నాలుగు రోజుల షూట్ కోసం చెన్నై వెళ్లారట. అందుకే చిరంజీవి గాడ్ ఫాదర్ షూటింగ్‌ను కెమెరామెన్‌ నీరవ్ లేని కారణంగా ఆపారనే న్యూస్ ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతోంది. 

Chiranjeevi Godfather shoot postponed:

Chiranjeevi Godfather shoot postponed due to nirav shah

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ