టాలీవుడ్ లో ఈమధ్యన రసవత్తరంగా వినిపిస్తున్న, నడుస్తున్న చర్చ మా ఎలక్షన్స్. ప్రకాష్ రాజ్ - విష్ణు మధ్యన రసవత్తర పోటీ నెలకొనగా.. హేమ - జీవిత రాజశేఖర్, కాదంబరి కిరణ్, నరసింహారావు మధ్యన అంతంత మాత్రం పోటీ మాత్రమే నడిచేలా కనిపిస్తుంది. ఇక ప్రకాష్ రాజ్ ప్యానల్ - మంచు విష్ణు ప్యానల్ మధ్యన గట్టి పోటీ ఉండబోతుంది. అయితే కరోనా కారణముగా మా ఎన్నికలు వాయిదా కూడా పడే అవకాశం ఉంది అనే అనుకున్నారు. మెగాస్టార్ చిరు కృష్ణం రాజు కి రాసిన లేఖతో మా ఎన్నికలు మరింత రసవత్తరంగా మారాయి,.
ఇక అక్టోబర్ లో మా ఎన్నికలు జరగబోతున్నాయనే ప్రచారం జరుగుతన్న వేళ.. అక్టోబర్ 10 న మా ఎన్నికలు జరగనున్నట్లుగా మా అసోసెషన్ ప్రకటించింది. మా ఎన్నికలు డేట్ రావడంతో.. ఇప్పుడు మా ఎన్నికల ప్రచారం షురూ అయ్యింది. ప్రకాష్ రాజ్ ఇప్పటికే ప్యానల్ ప్రకటించగా..మంచు విష్ణు ప్యానల్, జీవిత, హేమ మిగతా వారి ప్యానల్స్ ప్రకటించాల్సి ఉంది. అయితే ఈ మా అధ్యక్ష పోటీ నుండి ఎవరు ఎవరు తప్పుకుంటారో.. ఫైనల్ గా ఎవరు పోటీకి తలపడతారో చూడాలి.