Advertisementt

అల్లు అర్జున్ తర్వాతే ఎవరైనా

Thu 26th Aug 2021 08:50 PM
divi vadthya,bigg boss beauty,divi praises allu arjun dance moves,allu arjun dance,allu arjun  అల్లు అర్జున్ తర్వాతే ఎవరైనా
Divi Vadthya praises Allu Arjun dance moves అల్లు అర్జున్ తర్వాతే ఎవరైనా
Advertisement
Ads by CJ

టాలీవుడ్ లో మెగాస్టార్ చిరు తర్వాత డాన్స్ విషయంలో ఎవరు నెంబర్ వన్ అనే విషయం పై ఎప్పటినుండో చర్చ నడుస్తూనే ఉంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ డాన్స్ విషయంలో ముగ్గురు పోటీ పడుతున్నా.. అల్లు అర్జున్ డాన్స్ స్టయిల్ కి బాలీవుడ్ హీరోలే ఫిదా అవుతున్నారు. అలా వైకుంఠపురములో సాంగ్స్ తర్వాత అల్లు అర్జున్ డాన్స్ కి బోలెడంత మంది క్రికెటర్స్ కూడా ఫాన్స్ అయ్యారు. 

ఇక తాజాగా అల్లు అర్జున్ డాన్స్ తరవాతే ఎవరి డాన్స్ అయినా అంటుంది బిగ్ బాస్ బ్యూటీ దివి. ఈ మధ్యన దివి కూడా ఓ డాన్స్ ఆల్బమ్ చేసింది. ఆ ఎండలో తాను డాన్స్ చేస్తూ.. దానిని షూట్ చేసినప్పుడు డాన్స్ లో ఉండే కష్టం తెలిసింది అని,  అల్లు అర్జున్ డాన్స్ అంటే చాలా ఇష్టమని, అల్లు అర్జున్ ఫ్లోలో స్టెప్స్ టకాటకా అందుకుంటారని, అది ఎలాగో తనకి తెలియదని, వాళ్ళు ముందు ప్రాక్టీస్ చేస్తారా.. లేదో తెలియదు కానీ.. ఆయన డాన్స్ మాత్రం అదిరిపోతుంది. డాన్స్ లో, నటనలో అల్లు అర్జున్ పెర్ఫెక్షనిస్ట్ అంటుంది దివి. ఆయన డాన్స్ చూస్తే ఎవరైనా వావ్ అనేస్తారు. ఐ లవ్ డాన్స్, అల్లు అర్జున్ డాన్స్ అంటే మరింత ఇష్టం అంటూ అల్లు అర్జున్ డాన్స్ ని తెగ పొగిడేసింది. 

Divi Vadthya praises Allu Arjun dance moves:

Bigg boss beauty Divi Vadthya praises Allu Arjun dance moves

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ