Advertisementt

ఎన్టీఆర్ - నాగ్ పోటిలేదు.. కానీ..

Thu 26th Aug 2021 09:30 PM
nagarjuna,ntr,tv shows,bigg boss,evaru meelo kotiswarulu  ఎన్టీఆర్ - నాగ్ పోటిలేదు.. కానీ..
There is no competition between Nagarjuna and NTR but.. ఎన్టీఆర్ - నాగ్ పోటిలేదు.. కానీ..
Advertisement
Ads by CJ

ఎన్టీఆర్ ఇప్పుడు బుల్లితెర మీద ఎవరు మీలో కోటీశ్వరులు అంటూ దున్నేస్తున్నాడు. కోటు, సూటు, బూటు వాక్చాతుర్యంతో ఎన్టీఆర్ అల్లడిస్తున్నాడు. ఎవరు మీలో కోటీశ్వరులు షో తో ప్రేక్షకులని, ఫాన్స్ ని మెస్మరైజ్ చేస్తున్నాడు. ఎన్టీఆర్ షో తో ఫాన్స్ అయితే ఫుల్ హ్యాపీ. ఆర్.ఆర్.ఆర్ తో ఎన్టీఆర్ ని ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఎదురు చూస్తుంటే ... ఇలా బుల్లితెర మీద ఎన్టీఆర్ ఇరగదీస్తున్నాడు. అయితే ఎప్పుడు ఎన్టీఆర్ షో కి పోటీగా.. స్టార్ మా లో నాగార్జున హోస్ట్ గా బిగ్ బాస్ సీజన్ 5 మొదలు కాబోతుంది. 

అయితే ఇక్కడ ఎన్టీఆర్ షో ఎవరు మీలో కోటీశ్వరులకు - నాగార్జున బిగ్ బాస్ కి మధ్యన పోటీ లేదు. అంటే ఎన్టీఆర్ షో సోమవారం నుండి గురువారం వరకు రాత్రి 8.30 నిమిషాల నుండి 9.30 నిమిషాల వరకు ప్రసారం అవుతుంది. ఇక బిగ్ బాస్ సోమవారం నుండి శుక్రవారం వరకు రాత్రి 10 గంటలకు ప్రసారమవుతుంది. సో ఆ లెక్కన ఇద్దరికి పోటీ లేదు. కానీ ఇక్కడ ఏ షో కి ఎక్కువ టిఆర్పి వస్తుందో అనేది హాట్ టాపిక్. ఎన్టీఆర్ క్రేజ్ ముందు నాగ్ క్రేజ్ కూసింత తక్కువే. అయితే ఇక్కడ ఎవరు మీలో కోటీశ్వరులు షో కన్నా.. ఎక్కువగా బిగ్ బాస్ కె ఆదరణ. చూద్దాం.. ఏ షో కి ఎక్కువ టిఆర్పి వస్తుందో అనేది. 

There is no competition between Nagarjuna and NTR but..:

Nagarjuna and NTR TV shows

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ