Advertisementt

ఆర్.ఆర్.ఆర్ పై కి మ‌హా స‌ముద్రం

Fri 27th Aug 2021 06:23 PM
sharwanand,siddharth,ajay bhupathi,ak entertainment,maha samudram movie,maha samudram releasing worldwide on october 14  ఆర్.ఆర్.ఆర్ పై కి మ‌హా స‌ముద్రం
Maha Samudram Releasing Worldwide On October 14 ఆర్.ఆర్.ఆర్ పై కి మ‌హా స‌ముద్రం
Advertisement
Ads by CJ

కరోనా  కారణంగా ఇన్ టైం లో రిలీజ్ అవ్వాల్సిన సినిమాల్ని పోస్ట్ పోన్ అవుతున్నాయి. ఈ ఏడాది విడుదల కావాల్సిన సినిమాలు సినిమాలు వచ్చే ఏడాదికి షిఫ్ట్ అవుతున్నాయి. అయితే రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ మాత్రం అనుకున్న టైం అక్టోబర్ 13 న దసరాకే రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటిస్తూ వస్తున్నారు. అలాంటి పాన్  ఆర్.ఆర్.ఆర్ పై ఇప్పుడు మహాసముద్రాన్ని వదులుతున్నారు మేకర్స్. 

ఓ రంగంపై నిపుణులు ఓ ప్రాజెక్ట్ కోసం క‌లిసి ప‌నిచేస్తుంటే అదొక అద్భుత‌మ‌వుతుంద‌న‌డంలో సందేహం లేదు. ఈ సంద‌ర్భాన్ని మ‌హా స‌ముద్రం సినిమాలో మ‌నం చూడొచ్చు. టాలెంటెడ్ యాక్టర్స్ శ‌ర్వానంద్‌, సిద్ధార్థ్ హీరోలుగా న‌టిస్తోన్న ఈ సినిమాను ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ ఎ.కె.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌లో అజ‌య్ భూప‌తి వంటి టాలెంటెడ్ ద‌ర్శ‌కుడు తెర‌కెక్కిస్తున్నారు.

శుక్ర‌వారం ఈ సినిమా రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేస్తూ నిర్మాత‌లు ఓ స‌రికొత్త పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. ఈ పోస్ట‌ర్‌లో శ‌ర్వానంద్‌, సిద్ధార్థ్ ఒక‌రిపై మ‌రొక‌రు తుపాకులు ఎక్కుపెట్టుకున్నారు. వీరికి కొంత దూరంలో ఉండే స‌ముద్రంలో హీరోయిన్ అదితిరావు హైద‌రి నీళ్ల‌లో నిల‌బ‌డి ఎంజాయ్ చేస్తుంది. శ‌ర్వానంద్‌, సిద్ధార్థ్ లుక్స్ మాసీగా, డిఫ‌రెంట్‌గా ఆక‌ట్టుకుంటున్నాయి. వీరికి భిన్నంగా అంద‌మైన లుక్‌లో అదితిరావు హైద‌రి క‌నిపిస్తుంది. ప్ర‌పంచ వ్యాప్తంగా అక్టోబ‌ర్ 14న మ‌హా స‌ముద్రం విడుద‌ల‌వుతుంది.

Maha Samudram Releasing Worldwide On October 14:

Sharwanand, Siddharth, Ajay Bhupathi, AK Entertainment Maha Samudram Releasing Worldwide On October 14

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ