సెకండ్ వేవ్ ముగిసాక పొలోమంటూ సినిమాలు థియేటర్స్ లో రిలీజ్ అవుతున్నాయి. ఇప్పటివరకు ఓ మాదిరి సినిమాలే థియేటర్స్ లో విడుదలయ్యాయి. అయితే సెకండ్ వేవ్ కి ముందు విడుదల కావాల్సిన నాగ చైతన్య లవ్ స్టోరీ ని సెప్టెంబర్ 10 న రిలీజ్ చేస్తున్నట్టుగా మేకర్స్ అఫీషియల్ గా రిలీజ్ డేట్ ఇచ్చేసారు. ఆ తర్వాత నాని టక్ జగదీశ్ కూడా ఓటిటి నుండి అదే రోజున విడుదలవడంతో లవ్ స్టోరీ మేకర్స్ టక్ జగదీశ్ మేకర్స్ పై ఫైట్ చేసిన లాభం లేకపోయింది. అదిగో అప్పటినుండి లవ్ స్టోరీ పోస్ట్ పోన్ అంటూ ప్రచారం జరుగుతుంది.
కానీ మేకర్స్ స్పందన లేదు. మరోపక్క లవ్ స్టోరీ ప్రమోషన్స్ కూడా మొదలు కాలేదు. సెకండ్ వేవ్ కి ముందు లవ్ స్టోరీ రిలీజ్ డేట్ ఇచ్చినప్పుడు చాలావరకు ప్రమోషన్స్ పూర్తి చేసేసారు. కొత్త ప్రమోషన్స్ మొదలు పెట్టలేదు. అంటే దాదాపుగా లవ్ స్టోరీ రిలీజ్ పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ ఎక్కువగానే కనిపిస్తుంది. లేదంటే నాగ చైతన్య - సాయి పల్లవి, శేఖర్ కమ్ముల ఈపాటికి లవ్ స్టోరీ ఇంటర్వూస్, ఈవెంట్స్, ప్రెస్ మీట్స్, అంటూ హడావిడి మొదలు పెట్టేసేవారే. మరి వినాయక చవితికి లవ్ స్టోరీ దాదాపు రానట్లే..