చిరంజీవి ఆచార్య మూవీ షూటింగ్ కంప్లీట్ చేసి లూసిఫెర్ రీమేక్ గాడ్ ఫాదర్ సెట్స్ లోకి వెళ్లిపోయారు. చిరు బర్త్ డే స్పెషల్ గా దర్శకుడు మోహన్ రాజా గాడ్ ఫాదర్ టైటిల్ ని రివీల్ చేసారు. అయితే ఈ సినిమాలో చిరు కి రైట్ హ్యాండ్ అంటే బాడి గార్డుగా ఓ హీరో కనిపించాల్సి ఉంది. అలాగే సిస్టర్ కేరెక్టర్ కి నయనతార పేరు వినిపిస్తుంది. ఇక చిరు తమ్ముడిగాను ఓ హీరో నటించాల్సి ఉండగా.. విలన్ గా ఎవరు నటిస్తారో అనే విషయంలో అందరిలో ఆసక్తి మొదలయ్యింది. ఒరిజినల్ లూసిఫెర్ మూవీ లో విలన్ గా వివేక్ ఒబెరాయ్ నటించగా.. ఇప్పుడు గాడ్ ఫాదర్ విలన్ పై క్యూరియాసిటీ మొదలయ్యింది.
అయితే తాజాగా గాడ్ ఫాదర్ లో చిరు కి విలన్ గా కోలీవుడ్ నటుడు మాధవన్ నటించబోతున్నారని, స్టైలిష్ విలన్ గా మాధవన్ అయితే బావుంటాడని రామ్ చరణ్ కి అనిపించి మోహన్ రాజా అండ్ చిరు లకి చెప్పడంతో మోహన్ రాజా మాధవన్ ని సంప్రదించినట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే మాధవన్ సవ్యసాచి, నిశ్శబ్దం మూవీస్ లోను ఓ వెబ్ సీరీస్ లోను విలన్ గా అలరించాడు. ఇక గాడ్ ఫాదర్ లో చిరు సిస్టర్ కి భర్తగా, విలన్ గా మాధవన్ అయితే బావుంటాడని ఫిక్స్ అయినట్లుగా సమాచారం.