Advertisementt

త్రివిక్రమ్ సెంటిమెంట్ అది..

Tue 07th Sep 2021 03:36 PM
trivikram,trivikram srinivas,trivikram sentiment  త్రివిక్రమ్ సెంటిమెంట్ అది..
Trivikram sentiment.. త్రివిక్రమ్ సెంటిమెంట్ అది..
Advertisement
Ads by CJ

త్రివిక్రమ్ ఇప్పుడు టాప్ డైరెక్టర్. అలా వైకుంఠపురములో సినిమాతో త్రివిక్రమ్ రేంజ్ మరింతగా పెరిగిపోయింది. అయితే త్రివిక్రమ్ సినిమాల్లోకి ఎంటర్ అయినప్పుడు చాలా కష్టాలు పడ్డారు. నటుడు సునీల్ ఇంకొంతమంది (దశరద్) కలిసి ఓ చిన్న ఇంట్లో అద్దెకు ఉంటూ సినిమాలకు స్టోరీలు రాయడం చేసేవారనే విషయం బహిరంగ సత్యమే. పంజాగుట్టలో ఒక ఇంటిని అద్దెకు తీసుకుని ఆ ఇంటి నుండి సినిమా ఆఫీస్ ల చుట్టూ తిరుగుతూ.. ఇప్పుడు టాప్ పొజిషన్ ని మెయింటింగ్ చేస్తున్నారు త్రివిక్రమ్ బ్యాచ్.

అయితే ఇప్పుడు పొజిషన్ మారి టాప్ రేంజ్ కి వెళ్లినా త్రివిక్రమ్ కి మాత్రం తాను పంజాగుట్టలో ఉన్న ఆ చిన్న ఇంటిని  మాత్రం మరిచిపోలేదట. అందుకే తనకి వీలుగా ఉన్నప్పుడు త్రివిక్రమ్ ఆ ఇంటికి వేళ్ళు కథలు రాస్తుంటారట. అందుకే ఆ ఇంటికి ఇప్పటికి అద్దె చెల్లిస్తున్నారట. ఆ ఇంట్లో కూర్చుంటే.. కథలు రాయడం సులభంగా అలాగే సక్సెస్ సాధించవచ్చని త్రివిక్రమ్ సెంటిమెంట్ గా ఆ ఇంటికి అద్దె చెల్లిస్తూ తన కిందే ఉంచేసుకున్నారట. త్వరలో మరో కొత్త కథను రెడీ చేసే పనిలో ఉన్నట్టు వినికిడి. ఇక ప్రస్తుతం త్రివిక్రమ్ మహేష్ బాబు తో ఓ మూవీ చెయ్యడానికి రెడీగా ఉన్నారు. అలాగే పవన్ కళ్యాణ్ అయ్యప్పన్ కోషియం రీమేక్ కి హెల్ప్ చేస్తున్నారు. 

Trivikram sentiment..:

Trivikram sentiment

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ