Advertisementt

బ్యూటిఫుల్ గా ఉంది కానీ..

Mon 30th Aug 2021 02:13 PM
prabhas,pooja hegde,radhe shyam movie,radhesyam krishnashtami special  బ్యూటిఫుల్ గా ఉంది కానీ..
Radhe Shyam pic on Krishnashtami goes viral బ్యూటిఫుల్ గా ఉంది కానీ..
Advertisement
Ads by CJ

ప్రభాస్ - పూజ హెగ్డే కాంబోలో పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కుతున్న రాధేశ్యామ్ మూవీ జులై లో రిలీజ్ కావాల్సి ఉండగా.. సెకండ్ వేవ్ ప్రభాస్ ఫాన్స్ ని నిరాశపరిచింది. రాధేశ్యామ్ ని వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేస్తామని ప్రకటించారు మేకర్స్. రాధేశ్యామ్ షూటింగ్ మొదలైనప్పటినుండి ప్రమోషన్స్ పరంగా వీక్ గా ఉంది. అలాగే ప్రభాస్ లుక్ పై ఫాన్స్ కి కంప్లైంట్స్ ఉన్నాయి. ప్రభాస్ ఏజ్ తెలిసేలా ప్రభాస్ లుక్  కేరెక్టర్ ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఇక విక్రమాదిత్యగా ప్రభాస్ కటౌట్ కి సరిపోయే హీరోయిన్ గా పూజ హెగ్డే కనిపిస్తుంది. షూటింగ్ పూర్తయినా.. గ్రాఫిక్ వర్క్స్ వలన సినిమా రిలీజ్ వాయిదా పడింది. 

అయితే నేడు కృష్ణ జయంతి స్పెషల్ గా ప్రభాస్ రాధేశ్యాం నుండి ఓ బ్యూటిఫుల్ పోస్టర్ ని వదిలింది టీం. చాలా లవ్లీ గా ఉన్న ఆ పోస్టర్ లో ప్రభాస్ పూజ హేగ్డ్ కి పియానో నేర్పిస్తూ కనిపిస్తున్నాడు. కలర్ ఫుల్ గా బాగానే ఉన్నా.. ఎక్కడో, ఎప్పుడో చూసిన ఫీలింగ్ వస్తుంది ఆ పోస్టర్ చూస్తుంటే. నెమలి పించం, కలర్ కాంబినేషన్, పూజ, ప్రభాస్ లుక్స్ అన్ని ఓకె.. కానీ ఎక్కడో ఏదో ఫీలింగ్. ఇది ఎప్పుడో ఎక్కడో చూసాము అనిపించేలా ఉంది. మరి ఇప్పటివరకు వదిలిన రాధేశ్యామ్ పోస్టర్స్ ఒక ఎత్తు.. ఇప్పుడు వదిలిన ఈ కృష్ణాష్టమి పోస్టర్ ఒక ఎత్తు అనేలా ఉంది. 

Radhe Shyam pic on Krishnashtami goes viral:

Prabhas - Pooja Hegde Radhe Shyam pic on Krishnashtami goes viral

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ