Advertisementt

షూటింగ్ ఫినిష్ అంటున్న లక్ష్య నాగ శౌర్య

Mon 30th Aug 2021 05:41 PM
naga shaurya,lakshya movie,lakshya movie shooting wrapped up  షూటింగ్ ఫినిష్ అంటున్న లక్ష్య నాగ శౌర్య
LAKSHYA Shooting Wrapped Up షూటింగ్ ఫినిష్ అంటున్న లక్ష్య నాగ శౌర్య
Advertisement
Ads by CJ

 

యంగ్‌ హీరో నాగశౌర్య మంచి జోష్ లో ఉన్నాడు. ఆయన నటించిన వరుడు కావలెను సినిమా ప్రమోషన్స్ మొదలైపోయాయి. అంతేకాకుండా నాగ శౌర్య ల్యాండ్‌ మార్క్ 20వ చిత్రం లక్ష్య షూటింగ్‌ పూర్తయింది. ఈ సందర్భంగా విడుదలయిన వర్కింగ్‌ స్టిల్‌లో దర్శకుడు ధీరేంద్ర సంతోష్‌ జాగర్లపూడి ఓ సీన్‌ని నాగశౌర్యకి వివరిస్తున్నారు. కేతిక శర్మతో పాటు మానిటర్‌ చూస్తూ సీన్‌ గురించి వింటున్నారు నాగశౌర్య. హీరోనీ, దర్శకుడినీ చూస్తుంటే వాళ్ల మధ్య ఉన్న ర్యాపో ఎలా ఉంటుందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.

భారతదేశ ప్రాచీన విద్య ఆర్చెరీ నేపథ్యంతో తెరకెక్కుతున్న సినిమా లక్ష్య. ఎగ్జయిటింగ్‌ ఎలిమెంట్స్ తో, ఎంటర్‌టైనింగ్‌ వేలో, ఎంగేజింగ్‌గా స్క్రిప్ట్ ని సిద్ధం చేసుకున్నారు దర్శకుడు. ఇందులో రెండు వైవిధ్యమైన లుక్స్ తో ఆకట్టుకుంటున్నారు నాగశౌర్య. రెండింటిమధ్య వేరియేషన్‌ చూపించడానికి ఆయన కష్టపడ్డ తీరు స్ఫూర్తిదాయకం.

డైరక్టర్‌ సంతోష్‌ జాగర్లపూడి సరికొత్త కథను నెరేట్‌ చేయడంతోనే, నాగశౌర్య అందులో ఉన్న అనుపానులను అర్థం చేసుకోవడానికి కావల్సిన రీతిలో శిక్షణ తీసుకున్నారు. ఇదే ఫోర్స్ తో షూటింగ్‌ కూడా పూర్తి చేశారు. ఇప్పుడు టీమ్‌ తమ ఫోకస్‌ని పోస్ట్ ప్రొడక్షన్‌ వైపు షిఫ్ట్ చేసింది.  నిర్మాణానంతర కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయి.

LAKSHYA Shooting Wrapped Up:

Naga Shaurya LAKSHYA Shooting Wrapped Up

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ