పవన్ కళ్యాణ్ బర్త్ డే కి టైం దగ్గర పడుతుంది. పవన్ బర్త్ డే సెలెబ్రేషన్స్ కనివిని ఎరుగని రీతిలో ఓ రేంజ్ లో చెయ్యాలని పవన్ ఫాన్స్ కాచుకుని కూర్చున్నారు. పవనోత్సవం అంటూ సోషల్ మీడియాలో పవన్ ఫాన్స్ చేసే హంగామా అంతా ఇంతా కాదు. ఇక ఆయన నటించబోయే నటించబోతున్న సినిమాల నుండి కూడా పవన్ ఫాన్స్ కి ట్రీట్స్ సిద్ధమవుతున్నాయి. అందులో ముఖ్యంగా ఆయన నటిస్తున్న మలయాళ అయ్యప్పన్ కోషియం రీమేక్ భీమ్లా నాయక్ నుండి ఫస్ట్ సింగిల్ రివీల్ చెయ్యబోతున్నట్టుగా ఎప్పుడో అనౌన్స్ చేసారు మేకర్స్.
థమన్ మ్యూజిక్ అందిస్తున్న భీమ్లా నాయక్ పై భారీ అంచనాలున్నాయి. బ్యాగ్ రౌండ్ స్కోర్ అద్భుతంగా ఇచ్చిన థమన్.. మ్యూజిక్ కూడా అంతే అద్భుతంగా ఇస్తాడని అంటున్నారు. మరి భీమ్లా నాయక్ ఫస్ట్ సింగిల్ టైం ని కూడా ఫిక్స్ చేసింది టీం. పవన్ కళ్యాణ్ పుట్టినరోజున ఉదయం 11:16 గంటలకు భీమ్లా నాయక్ ఫస్టు సింగిల్ గా టైటిల్ సాంగ్ ను రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు మేకర్స్. దానితో పవన్ ఫాన్స్ అలెర్ట్ అయ్యారు. పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ ఫస్ట్ సింగిల్ తోనే సోషల్ మీడియా లో రచ్చ కి తెరలేపాలని డిసైడ్ అయ్యారు వారు.