Advertisementt

కార్తీక దీపం: మీ ఫ్యామిలీ మొత్తాన్ని చంపేస్తా

Tue 31st Aug 2021 01:33 PM
karthika deepam serial,karthika deepam,karthik,nirupam,premi viswanadh,monitha,vantalakka,deepa  కార్తీక దీపం: మీ ఫ్యామిలీ మొత్తాన్ని చంపేస్తా
Karthika Deepam today episode కార్తీక దీపం: మీ ఫ్యామిలీ మొత్తాన్ని చంపేస్తా
Advertisement
Ads by CJ

శుక్రవారం నుండి శనివారం వరకు రాత్రి 7.30 నిమిషాలకు స్టార్ మా లో ప్రసారం అవుతున్న కార్తీక దీపం సీరియల్ రోజుకో ట్విస్ట్ తో బుల్లితెర ప్రేక్షకులని ఆకట్టుకుంటుంది. డాక్టర్ బాబు కార్తీక్ మోనిత ని హత్య చేసాడనే నేరంలో జైలు పాలవ్వగా.. మోనిత చనిపోయినట్టు నాటకం ఆడుతూ కార్తీక్ ని దక్కించుకునే ప్రయత్నాల్లో దీపని చంపెయ్యలని తిరుగుతుంది. వంటలక్క దీప మోనితని పట్టుకుని భర్త ని రక్షించుకోవాలని ప్రయత్నాలు చేస్తుంది. కార్తీక్ కోసం మోనిత ఓ నాటకం ఆడుతుంది. కానిస్టేబుల్ రత్న సీత సహాయంతో కార్తీక్ ని హాస్పిటల్ పాలయ్యేలా చేసి కార్తీక్ ని బెదిరిస్తోంది. 

నిన్ను బయటికి తీసుకురాగల ఒకే ఒక్క ఆధారాన్ని నేను.. నేను వెళ్లి లొంగిపోతాను, నన్ను పెళ్లి చేసుకో.. దీప, పిల్లలు అందరితో నేను, నువ్వు కలిసి హ్యాపీగా ఉందాము. లేదంటే నీ ఫ్యామిలీ మెంబెర్స్ మొత్తాన్ని చంపేస్తా. బయట ఉన్న అపరిచితుడు నీ ఫ్యామిలీ చంపిస్తే.. మరో అపరిచితుడు దీపని చంపేస్తాడు. నేను చెప్పింది ఒప్పుకో. నన్ను పెళ్లి చేసుకో.. ఇంత అందాన్ని బోనస్ గా దక్కించుకో.. లేదంటే నేను చచ్చింది నిజమని నమ్ముతున్న వారికీ నిజం చేస్తాను నిన్ను చంపి నేను చస్తాను. నువ్వు లేని జీవితం నాకొద్దు అంటూ బెదిరించిన మోనిత ని చూసిన కార్తీక్ భయపడతాడు.

తర్వాత దీప కార్తీక్ ని చూసేందుకు హాస్పిటల్ కి వచ్చెలోపు మోనిత తప్పించుకుంటుంది. కార్తీక్ కి దీపతో మోనిత గురించి చెప్పాలని ఉన్నా.. తన భర్య పిల్లలని ఏం చేస్తాడో అని భయపడి దీపని కౌగలించుకుని బాధపడతాడు. దీప కార్తీక్ కి ధైర్యం చెబుతుంది. మీకు ఏం కాదు.. మీరు ప్రశాంతంగా ఉండండి.. నేను ఇక్కడే ఉంటాను అని చెబుతుంది దీప. 

Karthika Deepam today episode:

Karthika Deepam Serial today episode

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ