Advertisementt

పోలిశెట్టి నెక్స్ట్ ఏంటి?

Tue 31st Aug 2021 05:51 PM
anushka,naveen polishetty,jathi ratnalu,naveen  పోలిశెట్టి నెక్స్ట్ ఏంటి?
What's next Polishetty? పోలిశెట్టి నెక్స్ట్ ఏంటి?
Advertisement
Ads by CJ

జాతి రత్నాలు తో ఒక్కసారిగా అందరి మనసులు దోచేసిన నవీన్ పోలిశెట్టి క్రేజ్ ఇప్పుడు సోషల్ మీడియాలో అంతకంతకు పెరిగిపోయింది. ఫస్ట్ టైం సస్పెన్స్ థ్రిల్లర్ ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయతో అదరగొట్టేసిన నవీన్ పోలిశెట్టి జాతి రత్నాలు తో కామెడీతో అదరగొట్టేసాడు. ఆ సినిమా తర్వాత నవీన్ పోలిశెట్టి రేంజ్ పెరగడం, యూవీ క్రియేషన్స్ నుండి, సితార ఎంట‌ర్‌టైన్మెంట్స్ వారికీ కమిట్ అయ్యి అడ్వాన్స్ లు పుచ్చుకున్నాడు. అనుష్క శెట్టి తో నవీన్ పోలిశెట్టి మూవీ అంటూ ప్రచారం జరగడం అది ఆగిపోయింది అనే న్యూస్ రావడం చూసాం. ఆ తర్వాత కూడా నవీన్ పోలిశెట్టి కథలు వింటున్నాడని.. యువీ లో కానీ, సితార లో కానీ కొత్త మూవీ మొదలు కాబోతుంది అనే అన్నారు. 

తాజాగా నవీన్ పోలిశెట్టి - సితార ఎంట‌ర్‌టైన్మెంట్స్ కాంబో మూవీ ఆగిపోయినట్లే అంటున్నారు. రంగ్ దే దర్శకుడు వెంకీ అట్లూరి కథతో సితార బ్యానర్ లో ఓ మూవీ అనుకుంటే.. ఆ కథ లో ఎన్ని మార్పులు చేసినా నవీన్ పోలిశెట్టికి నచ్చక ఆ సినిమా కి తాను సితార బ్యానర్ నుండి తీసుకున్న అడ్వాన్స్ లు వెనక్కి ఇచ్చేసాడనే టాక్ నడుస్తుంది. మరి జాతి రత్నాలు తర్వాత వెంటనే మూవీ మొదలెట్టేస్తాడు అనుకున్న నవీన్ పోలిశెట్టి తదుపరి మూవీపై అందరిలో ఆసక్తి మొదలైనా.. నవీన్ మాత్రం క్లారిటీ ఇవ్వడం లేదు. 

What's next Polishetty?:

Anushka next with Naveen Polishetty: Not Happening

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ