Advertisementt

ఎన్టీఆర్ ని అస్సహ్యంగా ఉన్నావన్న జక్కన్న

Tue 31st Aug 2021 09:48 PM
ntr,evaru meelo koteeswarudu show,rajamouli,ntr - rajamouli,rrr movie  ఎన్టీఆర్ ని అస్సహ్యంగా ఉన్నావన్న జక్కన్న
Jakkanna said that NTR is disgusting ఎన్టీఆర్ ని అస్సహ్యంగా ఉన్నావన్న జక్కన్న
Advertisement
Ads by CJ

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం జక్కన్న రాజమౌళి తో కలిసి ఆర్.ఆర్.ఆర్ మూవీ చేస్తున్నాడు. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఆర్.ఆర్.ఆర్ షూటింగ్ కంప్లీట్ అవడంతో ఎన్టీఆర్ ఎవరు మీలో కోటీశ్వరులు షోకి జంప్ అయ్యాడు. అయితే ప్రస్తుతం ఎన్టీఆర్ ఆర్.ఆర్.ఆర్ కోసం కండలు పెంచి సిక్స్ ప్యాక్ లుక్ లోకి మారిపోయాడు. ఇంతకుముందు ఎన్టీఆర్ బాగా లావుగా ఉండేవాడు. చాలామంది ఎన్టీఆర్ ని పందిపిల్లతో పోల్చిన సందర్భాలు ఉన్నాయి. ఆంధ్రావాలా, రాఖి సినిమాల టైం లో ఎన్టీఆర్ అధిక బరువుతో అవుట్ అఫ్ షేప్ తో విమర్శలు ఎదుర్కున్నాడు. 

అయితే ఎన్టీఆర్ ని ఎవరూ నువ్వు లావుగా ఉన్నావు అన్నవారు లేరట. అలాగే తాను ఎక్కువ బరువు వున్నాను అని అనిపించనైనను లేదట. కానీ ఒకసారి ఎన్టీఆర్ జక్కన్నని కలవగా.. చాలా అసహ్యంగా ఉన్నావు అనగానే ఎన్టీఆర్ కి అప్పుడు లైట్ వెలిగిందట. అప్పుడే కష్టపడి బరువు తగ్గాడట. ఈ విషయాన్నీ ఎన్టీఆర్ ఎవరు మీలో కోటీశ్వరులు షోలో రివీల్ చేసాడు. ఆ షో లో ఓ కంటెస్టెంట్స్ జుట్టు ప్రాబ్లెమ్ అని చెప్పగానే.. నీకు జుట్టు ప్రాబ్లెమ్, నాకు కొవ్వు ప్రాబ్లెమ్ అంటూ నవ్వేసాడు. మరి రాజమౌళి చెప్పడంతో ఎన్టీఆర్ బాగా బరువు తగ్గి యమదొంగ సినిమా చేసాడు. ఆ తర్వాత ఎన్టీఆర్ మళ్ళీ మంచి ఫిజిక్ ని మెయింటింగ్ చేస్తూ ఫాన్స్ ని మమైమరపింప జేస్తున్న విషయం తెలిసిందే. 

Jakkanna said that NTR is disgusting:

NTR Evaru Meelo koteeswarudu today episode

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ