బిగ్ బాస్ సీజన్ 5 వచ్చే ఆదివారం అంటే సెప్టెంబర్ 5 న గ్రాండ్ గా స్టార్ మా లో సాయంత్రం 6 గంటలకు నాగార్జున హోస్ట్ గా మొదలు కాబోతున్న విషయాన్నీ స్టార్ మా బిగ్ బాస్ ప్రోమోస్ తో ప్రకటించింది. ఇప్పటివరకు ప్రసారం అయిన సీజన్స్ అన్ని సూపర్ హిట్ అవడంతో సీజన్ 5 మంచి అంచనాలే ఉన్నాయి. అయితే ఇంకా మొదలు కానీ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళే కంటెస్టెంట్స్ లిస్ట్ లీక్ అంటూ చాలామంది పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అందులో యాంకర్ రవి, యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్, సిరి, నవ్య స్వామి లాంటి పేర్లు ఉన్నాయి. ఇప్పటికే 13 కంటెస్టెంట్స్ బిగ్ బాస్ క్వారంటైన్ కి వెళ్లారని, బిగ్ బాస్ సీజన్ 5 గ్రాండ్ ఎంట్రీ ఎపిసోడ్ లో పాల్గొంటారని తెలుస్తుంది.
అయితే ఇప్పుడు బిగ్ బాస్ 5లోకి వెళ్లబోయే కంటెస్టెంట్స్ అందరిలో యూట్యూబ్ స్టార్ షణ్ముఖ జస్వంత్ అందరికన్నా స్ట్రాంగ్ గా ఉన్న సెలెబ్రిటీ అని, ఇప్పటికే షణ్ముఖ్ సోషల్ మీడియా క్యాపైనింగ్ మొదలైంది అని, తాను చేసిన వెబ్ సీరీస్ తో విశేషమైన అభిమానులని సంపాదించుకున్న షణ్ముఖ్ కి కోటిమందికి పైగా ఫాలోవర్స్ ఉన్నారని, అంత బలంతోనే షణ్ముఖ్ బిగ్ బాస్ సీజన్ 5 విన్నర్ అంటూ ఓ న్యూస్ సోషల్ మీడియాలో రేజ్ అయ్యింది.
అంటే షణ్ముఖ్ జస్వంత్ టైటిల్ ఫెవరెట్ గా బరిలోకి దిగడం కాదు.. టైటిల్ ని తెచ్చెయ్యడానికే వెళుతున్నాడని ఫాన్స్ కాదు.. ఆఖరికి సోషల్ మీడియా కూడా ఫిక్స్ అయితే.. ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టుగా బిగ్ బాస్ మొదలవలేదు కానీ అప్పుడే ఫైనల్ విన్నర్ ని ఫిక్స్ చేసారా అంటున్నారు నెటిజెన్స్.