యాక్షన్ హీరో విశాల్ ఎ. వినోద్‌కుమార్ దర్శకత్వంలో ఒక హై ఆక్టేన్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో నటించనున్నారు. విశాల్ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ చెన్నైలోని ప్రసిద్ద సాయిబాబా దేవాలయంలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ప్రస్తుతం ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది.
రానా ప్రొడక్షన్స్ పతాకంపై రమణ, నంద సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్‌లో విశాల్‌కు ప్రతినాయికగా సునైన నటిస్తోంది.
ఈ సినిమాకోసం మేకర్స్ ఒక పవర్‌ఫుల్ టైటిల్‌ను కన్ఫర్మ్ చేశారు. సమాజంలో పెద్ద మార్పు తీసుకురావడాన్ని ప్రభావితం చేసే అంశం. ఈ సినిమాకు అన్ని భాషలకు ఒకే టైటిల్ ఉండనుంది.
అతి త్వరలో టైటిల్‌ను ప్రకటించనున్నారు.
విశాల్ ఇప్పటికే ఎన్నో యాక్షన్ ఎంటర్‌టైనర్స్‌లో నటించారు. అయితే ఈ సినిమా వాటికి భిన్నంగా ఉండనుంది. ఈ మూవీలో యాక్షన్ సీక్వెన్సెస్ తప్పకుండా యాక్షన్ ప్రియుల్ని అలరించనున్నాయి. ముఖ్యంగా ఈ సినిమా సెకండాఫ్‌లో 45 నిమిషాల నిడివిగల యాక్షన్ సీక్వెన్స్‌లు ఉండడం విశేషం. స్టంట్ డైరెక్టర్ దిలీప్ సుబ్బరాయన్ పర్యవేక్షణలో ఈ స్టంట్స్ జరగనున్నాయి.