Advertisementt

వైఎస్ ఘాట్ వద్ద విడివిడిగా కాదు.. కలిసి కట్టుగా

Sat 18th Sep 2021 12:20 PM
ysr family,ap cm jagan,sharmila,vijayamma,ys bharati,ysr family pays tribute to ys rajasekhara reddy,ys rajasekhara reddy  వైఎస్ ఘాట్ వద్ద విడివిడిగా కాదు.. కలిసి కట్టుగా
YS Jagan and family pays tributes at YSR Samadhi వైఎస్ ఘాట్ వద్ద విడివిడిగా కాదు.. కలిసి కట్టుగా
Advertisement
Ads by CJ

ఈరోజు దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి 12 వ వర్ధంతి. అయన వర్ధంతి సందర్భంగా జగన్ ఆయన చెల్లి తల్లి విడివిడిగా సమాధి దర్శనానికి వస్తారు.. ఈ మధ్యన అన్న - చెల్లెళ్ళ మధ్యన పొసగడం లేదంటూ ప్రచారం జరిగింది. కానీ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా కొడుక ఏపీ సీఎం వైఎస్‌ జగన్, తల్లి విజయమ్మ, చెల్లి షర్మిల కలిసికట్టుగా ఆయన కి ఘనంగా నివాళులర్పించారు. ఇడుపులపాయలోని వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద పూల మాల వేసి శ్రద్దాంజలి ఘటించారు. సీఎం  వైఎస్‌ జగన్, ఆయన సతీమణి వైఎస్‌ భారతిరెడ్డి, తల్లి వైఎస్‌ విజయమ్మ, సోదరి వైఎస్‌ షర్మిల, దివంగత వైఎస్‌ జార్జిరెడ్డి సతీమణి వైఎస్‌ భారతమ్మ, టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, వైఎస్‌ కుటుంబ సభ్యులు వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద పూలమాలలు ఉంచి అంజలి ఘటించారు. 

జగన్ తో పాటుగా ఏపీ మంత్రులు కూడా రాజశేఖర్ రెడ్డి సమాధి వద్ద నివాళులు అర్పించారు. డిప్యూటీ సీఎంలు ఎస్‌బీ అంజాద్‌ బాషా, నారాయణ స్వామి, ఇంచార్జి మంత్రి ఆదిమూలపు సురేష్, ఎంపీలు వైఎస్‌ అవినాష్‌ రెడ్డి, గోరంట్ల మాధవ్, గురుమూర్తి, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌ రెడ్డి, ప్రభుత్వ విప్‌లు కొరుముట్ల శ్రీనివాసులు, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ఇడుపులపాయల రాజశేఖర్ రెడ్డి సమాధి వద్ద సందడి చేసారు. 

YS Jagan and family pays tributes at YSR Samadhi:

YSR Family Pays Tribute To YS Rajasekhara Reddy

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ