ప్రస్తుతం టాలీవుడ్ లో సెలబ్రిటీస్ ని ఈడీ విచారణ కోసం తమ కార్యాలయానికి పిలుస్తుంది. ఇప్పటికే పూరి జగన్నాధ్ ని విచారించిన ఈడీ అధికారులు ఇప్పుడు నటి ఛార్మి ని విచారిస్తుంది. ఈ రోజు ఉదయమే ఛార్మి ఈడీ ఆఫీస్ కి వచ్చింది. ప్రస్తుతం ఛార్మి ఈడీ కార్యాలయంలో అధికారుల విచారణలో ఉంది. అయితే డ్రగ్స్ వ్యవహారం, మనీ లాండరింగ్ వ్యవహారాలతో ఇలా ఈడీ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్న పూరి జగన్నాధ్, ఛార్మి విషయంలో ఇప్పుడు విజయ్ దేవరకొండ టెంక్షన్ పడుతున్నాడని అంటున్నారు.
కారణం పూరి దర్శకత్వంలో పూరి - ఛార్మి భాగస్వాములుగా విజయ్ దేవరకొండ లైగర్ పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. ఈమధ్యన ముంబై లో లైగర్ రెస్యూమ్ షూట్ మొదలయ్యింది. అయితే ఇప్పుడు ఈడీ విచారణతో సినిమాపై ఎలాంటి ఇంపాక్ట్ పడుతుందో.. అని విజయ్ దేవరకొండ కంగారు పడుతున్నాడట. అందులోను పాన్ ఇండియా మూవీ.. ఇలా డ్రగ్స్ కేసు విచారణలో దర్శకనిర్మాతలు ఇన్వాల్వ్ అయ్యారంటే.. క్రేజ్ తగ్గే అవకాశాలు ఉంటాయి. కనకనే విజయ్ టెంక్షన్ పడుతున్నాడని అంటున్నారు ఆయన అభిమానులు.