ఈమధ్యన సమంత విషయంలో ఏదో జరుగుతుంది. కానీ ఏం జరుగుతుందో అనేది ఎవరికీ అర్ధం కావడం లేదు. సమంత - నాగ చైతన్య మధ్యన విభేదాలు వచ్చిన కారణంగా ఇద్దరూ విడాకులు తీసుకోబోతున్నట్టుగా ప్రచారం జరగడం, సోషల్ మీడియాలో సమంత అక్కినేని నుండి సమంత గా మారిపోవడం ఇవన్నీ అనుమానాలకు తావిచ్చింది. అయితే నాగార్జున పుట్టిన రోజున సమంత సోషల్ మీడియాలో విషెస్ చెప్పినా.. అదేరోజు ఫ్యామిలీ మెంబెర్స్ ఫ్రెమ్ లో నాగ్ - అమల, నాగ చైతన్య, అఖిల్ ఆఖరికి నాగర్జున కూక్స్ కూడా ఉన్నారు. కానీ సామ్ మిస్సింగ్. దానితో మళ్ళీ అనుమానాలు షురూ.
తాజాగా సమంత తీసుకున్న ఓ నిర్ణయంపై అందరిలో ఆ అనుమానం పెను భూతంలా మారిపోయింది. ప్రస్తుతం సమంత శాకుంతలం పాన్ ఇండియా ఫిలిం షూటింగ్ ఫినిష్ చేసి.. కోలీవుడ్ లోను విఘ్నేష్ శివన్ మూవీ షూటింగ్ కి బ్రేక్ ఇచ్చి ఎక్కడికో వెళుతుందట. అది కూడా ఒంటరిగా అంటున్నారు. అంతేకాదు.. సమంత తన పర్సనల్ స్టాఫ్ కి కూడా సెలవలు ఇచ్చేసిందట. దానితో అందరిలో మళ్ళీ మొలకెత్తిన అనుమానం.
అయితే సమంత తన పర్సనల్ స్టాఫ్ కి కూడా సెలవలు ఇచ్చి మరీ.. ఒంటరిగా వెళ్ళడానికి కారణం, ఈ మధ్యన సమంత విషయంలో జరుగుతున్న కాంట్రవర్సీనే కారణం అంటున్నారు. ప్రశాంతత కోసమే సమంత ఇలా ఒంటరిగా ఎక్కడికో వెళుతున్నట్టుగా ఆమె సన్నిహితుల నుండి బయటికి వచ్చిన సమాచారం.