Advertisementt

RC15 పై రామ్ చరణ్ ప్లాన్ అదుర్స్

Fri 03rd Sep 2021 10:16 AM
ram charan,rc15,kollywood director shankar,dil raju,rc15 opening  RC15 పై రామ్ చరణ్ ప్లాన్ అదుర్స్
Ram Charan Plans exiting on RC15 RC15 పై రామ్ చరణ్ ప్లాన్ అదుర్స్
Advertisement
Ads by CJ

రామ్ చరణ్ - కోలీవుడ్ టాప్ డైరెక్టర్ శంకర్ కాంబోలో మూడు భాషలో భారీ బడ్జెట్ తో దిల్ రాజు నిర్మించబోయే పాన్ ఇండియా మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ శంకర్ అసిస్టెంట్స్ ఆధ్వర్యంలో ఎప్పుడో మొదలైపోయింది. అయితే ఈ నెలలోనే రామ్ చరణ్ - శంకర్ RC15 మొదలు కాబోతుంది. దాని కోసం రామ్ చరణ్ అండ్ ప్రొడ్యూసర్ దిల్ రాజులు భారీ ప్లాన్స్ చేసినట్టుగా తెలుస్తుంది. సెప్టెంబర్ 13వ తేదీన రామ్ చరణ్ - శంకర్ మూవీ ని అఫీషియల్ గా మొదలు పెట్టి అక్టోబర్ నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలు పెడతారని తెలుస్తుంది. అయితే సెప్టెంబర్ 13న ఈ మూవీ పూజ కార్యక్రమాలను కనీవినీ ఎరుగని రీతిలో చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. 

RC15 పూజా కార్యక్రమాలను సెప్టెంబర్ 13న నిర్మాత దిల్ రాజు ఆఫీస్ లో గ్రాండ్‌ గా ప్లాన్ చేశారట. ఇందుకోసం కోవిడ్ ప్రోటోకాల్ పాటిస్తూ అన్ని ఏర్పాట్లను కూడా ఇప్పటికే మొదలు పెట్టారని తెలుస్తోంది. అంగరంగ వైభవంగా జరిగే RC15 ఓపెనింగ్ వేడుకకు కోలీవుడ్, టాలీవుడ్ సినీ ప్రముఖులు హాజరు కాబోతున్నారని సమాచారం. ఈ వేడుకలు కానీ విని రీతిలో ప్లాన్ చేసి.. బాలీవుడ్ మీడియా కూడా కవర్ చేసే విధంగా ఏర్పాట్లు జరుగుతూన్నాయట. 

ఈ పూజా కార్యక్రమాలు పూర్తైన కొద్దీ రోజులకే ఈ మూవీకి సంబంధించిన రెగ్యూలర్ షూట్ కూడా మొదలవుతుందని తెలుస్తుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా కియారా అద్వానీ ఫిక్స్ అవగా.. ఇప్పటికే మ్యూజిక్ డైరెక్టర్ థమన్ RC15 కి మ్యూజిక్ సిట్టింగ్ పూర్తి చేసినట్టుగా తెలుస్తుంది. 

Ram Charan Plans exiting on RC15:

Ram Charan RC15 Updade

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ