Advertisementt

ఎన్టీఆర్ కి 'ఎస్' చెప్పని లక్ష్మి ప్రణతి

Sat 18th Sep 2021 04:29 PM
jr ntr,young tiger ntr,ntr and lakshmi pranathi love story,ntr evaru meelo kotiswarulu show  ఎన్టీఆర్ కి 'ఎస్' చెప్పని లక్ష్మి ప్రణతి
Lakshmi Pranathi didn't say Yes to NTR ఎన్టీఆర్ కి 'ఎస్' చెప్పని లక్ష్మి ప్రణతి
Advertisement
Ads by CJ

ఎన్టీఆర్ పదేళ్ల క్రితం చంద్రబాబు చుట్టాలైనా లక్ష్మి ప్రణతి ని పెద్దల సమక్షంలో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అందమైన లక్ష్మి ప్రణతి స్టార్ హీరో ఎన్టీఆర్ ని పెళ్ళి చేసుకోవడం, వారికి ముత్యాల్లాంటి అందమైన ఇద్దరు అబ్బాయిలు పుట్టడం ఎన్టీఆర్ ఫాన్స్ కి ఆనందాన్ని ఇచ్చింది. ఇక ఫ్యామిలీ విషయంలో లో ప్రొఫైల్ ని మెయింటింగ్ చేస్తాడు ఎన్టీఆర్. అయితే ప్రస్తుతం అంటే ఎవరు మీలో కోటీశ్వరులు షో కి హోస్ట్ గా చేస్తున్నాడు. ఆ షో లో ఎన్టీఆర్ ప్రొఫెషనల్ విషయాలతో పాటుగా పర్సనల్ విషయాలను కంటెస్టెంట్స్ తో పంచుకున్నాడు. 

అందులో భాగంగా ఎన్టీఆర్ తన భర్య లక్ష్మి ప్రణతి ముచ్చట్లు చెప్పుకొచ్చాడు. ఎన్టీఆర్ పెద్దల సమక్షంలో లక్ష్మి ప్రణతి ని చూడడానికి పెళ్లి చూపులకి వెళితే.. అమ్మాయిని చూసిన ఎన్టీఆర్ నాకు అమ్మాయి నచ్చింది అని వచ్చేసాడట. కానీ లక్ష్మి ప్రణతి ఎన్టీఆర్ నచ్చాడు అని కానీ నచ్చలేదు అని కానీ చెప్పలేదట. ఆఖరికి నిశ్చితార్ధానికి పెళ్ళికి ఎనిమిది నెలల గ్యాప్ ఉన్నా.. లక్ష్మి ప్రణతి ఎప్పుడు తనకి ఎస్ అని చెప్పలేదట. అసలు ఈ అమ్మాయికి నేనంటే ఇష్టమేనా.. పెద్దలు చెప్పారని చేసుకుంటుందా అనే అనుమానం కూడా వచ్చిందట. 

అప్పటి నుండే ఆడవాళ్ళను అర్ధం చేసుకోవడం అంత సులభం కాదని, మగవాళ్ల వాళ్ళ వల్ల కాదని, ఆడవాళ్లను అర్ధం చేసుకున్నవాడు దేన్నైనా అర్ధం చేసుకుంటాడనే విషయం నాకు ఆ తర్వాత బోధ పడిందని ఎన్టీఆర్ ఎవరు మీలో కోటీశ్వరు షో లో చెప్పడం హైలెట్ అయ్యింది. 

Lakshmi Pranathi didn't say Yes to NTR:

Jr NTR and Lakshmi Pranathi love story

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ