రామ్ చరణ్ - శంకర్ కాంబోలో మొదలు కాబోతున్న RC15 రచ్చ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో కనిపిస్తుంది. అంటే RC15 కథపై దర్శకుడు శంకర్ పై కోలీవుడ్ స్టోరీ రైటర్ ఫిర్యాదు చెయ్యడం చర్చనీంశం అయ్యింది. మరోపక్క RC15 ఈ నెలల్లోనే మొదలు కాబోతుంది అనే న్యూస్ ప్రచారం లో ఉంది. ఈ నెల 13 న రామ్ చరణ్ - శంకర్ కాంబో పాన్ ఇండియా ఫిలిం మొదలు కాబోతుంది అని ఈ పూజ కార్యక్రమాలుకూడా కనివిని రీతిలో నిర్వహించబోతున్నారంటూ ప్రచారం జరుగుతుంది.,
మరోపక్క ఈ ఓపెనింగ్ డేట్ మారింది అని, సెప్టెంబర్ 8 నే RC15 పూజా కార్యక్రమాలతో మొదలు కాబోతుంది అంటూ రామ్ చరణ్ ఫాన్స్ రచ్చ షురూ చేసారు. ఫ్యాన్ మెడ్ పోస్టర్స్ తో RC15 ఓపెనింగ్ డేట్ ని ప్రింట్ చేసి షేర్ చేస్తున్నారు. RC15 ఓపెనింగ్ డేట్ తో రామ్ చరణ్ ఫాన్స్ చేసే హడావిడికి సోషల్ మీడియా షేక్ అవుతుంది. మరి దిల్ రాజు కాంపౌండ్ నుండి RC15 పై అఫీషియల్ అనౌన్సమెంట్ వచ్చేవరకు ఏ న్యూస్ ని నమ్మలేము సుమీ..