రకుల్ ప్రీత్ మనీ లాండరింగ్ కేసులో హైదరాబాద్ లోని ఈడీ ఆఫీస్ కి విచారణకు హాజరయ్యింది. ఇప్పటికే ఈ కేసులో ఈడీ అధికారులు పూరి జగన్నాధ్ ని 10 గంటల పాటు, హీరోయిన్ ఛార్మి ని ఎనిమిది గంటల పాటు ప్రశ్నించగా.. రకుల్ ప్రీత్ ని దాదాపుగా 6 గంటల పాటు ప్రశ్నించారు. డ్రగ్స్ సరఫరాదారు కెల్విన్ ఇచ్చిన సమాచారంలో ఈడీ అధికారులు రంగంలోకి దిగి 12 మంది సెలబ్రిటీస్ కి నోటీసు లు ఇచ్చారు. అందులో రకుల్ సెప్టెంబర్ 6 న హాజరవ్వాల్సి ఉంది.
కానీ రకుల్ ప్రీత్ కి షూటింగ్స్ ఉండడంతో రకుల్ రిక్వెస్ట్ మేరకు రకుల్ ని నేడు విచారణకు పిలిచారు ఈడీ అధికారులు. ఇక విచారణలో రకుల్ బ్యాంకు ఖాతాలను పరిశీలించిన అధికారులు.. ఆమె జరిపిన లావాదేవీలపై ప్రశ్నించినట్టు సమాచారం. రకుల్ ని ఈడీ అధికారులు ఏకంగా 30 ప్రశ్నలు అడిగినట్టుగా సమాచారం. అన్ని ప్రశ్నలకు రకుల్ ఓపిగ్గా సమాధానాలు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అసలు విదేశాల్లో ఈ మనీ లావాదేవీలు ఎలా జరిగాయి. అలాగే కెల్విన్ ఇచ్చిన సమాచారంతోనే ఈడీ విచారణ సాగుతుంది. ఈ నెల 8 న రానా ఈడీ విచారణకు హాజరు కావాల్సి ఉంది.