ఈ ఆదివారం మొదలు కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 5 పై బుల్లితెర ప్రేక్షకులు మంచి క్యూరియాసిటీతో ఎదురు చూస్తున్నారు. నాగార్జున హోస్ట్ గా మొదలు కాబోతున్న బిగ్ బాస్ 5 ఎన్నీరోజులు అంటే ఎన్ని ఎపిసోడ్స్ ఉంటుంది, ఎంతమంది హౌస్ లోకి వెళతారనే ఆసక్తి రోజు రోజుకి పెరిగిపోతుంది.. ఇక ఆదివారం స్టార్ మా లో ప్రసారం కాబోయే బిగ్ బాస్ గ్రాండ్ ఎంట్రీ ఎపిసోడ్ ని ఒకరోజు ముందే అంటే శనివారమే షూట్ చేసేస్తారు. అంటే నాగార్జున హోస్ట్ గా 13 మంది కంటెస్టెంట్స్ శనివారమే బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళిపోతారన్నమాట.
అయితే ఈ షో కి వెళ్లబోయే పేర్లలో ముఖ్యంగా మొదటి నుండి యాంకర్ రవి పేరు బాగా వినిపిస్తుంది. అయితే రవి దాదాపుగా బిగ్ బాస్ 5 ఎంటర్ కాబోయే వ్యక్తుల్లో ఉన్నారని, అయితే యాంకర్ రవి క్రేజ్ దృష్ట్యా రవి కేవలం రెండు వారల పాటే హౌస్ లో ఉండేందుకు బిగ్ బాస్ యాజమాన్యంతో డీల్ కుదుర్చుకున్నట్టుగా కొన్ని వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మరి రెండు వారల డీల్ కే రవి పారితోషకం కూడా భారీగా ఉండబోతున్నట్లుగా తెలుస్తుంది.