విజయ్ దేవరకొండ పూరి కాంబోలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా ఫిలిం లైగర్.. షూటింగ్ ఎక్కువ శాతం ముంబైలోనే చిత్రీకరణ జరుపుకుంది. ముంబై పరిసర ప్రాంతాల్లో విజయ్ దేవరకొండ, హీరోయిన్ అనన్య మిగతా తారాగణంపై మేజర్ పార్ట్ షూటింగ్ చిత్రీకరణ జరుపుకున్న లైగర్ షూటింగ్ ఇప్పుడు గోవాకి షిఫ్ట్ అవ్వబోతుంది. ప్రస్తుతం పూరి, ఛార్మి లు హైదరాబాద్ లోనే ఈడీ విచారణలో ఉన్నారు. ప్రస్తుతం వారిద్దరి విచారణ ముగియడం, ముంబై లో లైగర్ షెడ్యూల్ కంప్లీట్ అవ్వడంతో తదుపరి షెడ్యూల్ కోసం లైగర్ టీం గోవా వెళ్లబోతుంది. విజయ్ దేవరకొండ, అనన్య పాండే.. సినిమాలోని కీలక పాత్రధారులు అంతా పాల్గొనబోయే ఈ షెడ్యూల్ గోవాలో దాదాపుగా ఓ నెల రోజులపాటు ఉండబోతుంది.
ఈ నెల రోజులు సినిమాలోని కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతుందట. ఇక ఈ సినిమాలో మెయిన్ హైలెట్ గా నిలవబోయేది లైగర్ క్లైమాక్స్ అని, దాని కోసం పూరి జగన్నాధ్ విదేశీ ఫైటర్స్ తో క్లైమాక్స్ ఫైట్ ని ప్లాన్ చేసాడని తెలిసిందే. సెకండ్ వేవ్ లేకపోతె.. లైగర్ ఈపాటికి రిలీజ్ కి సిద్దమైపోయేది. అసలైతే సెప్టెంబర్ లోనే లైగర్ రిలీజ్ కావాల్సి ఉంది. మరి లైగర్ కొత్త రిలీజ్ డేట్ కోసం విజయ్ దేవరకొండ ఫాన్స్ వెయిటింగ్ లో ఉన్నారు.