Advertisementt

పస లేదు బాస్

Mon 06th Sep 2021 10:47 AM
bigg boss telugu 5,bigg boss telugu,nagarjuna,anchor,srirama chandra  పస లేదు బాస్
Bigg Boss 5 Telugu Grand Opening పస లేదు బాస్
Advertisement
Ads by CJ

నిన్న సాయంత్రం 6 గంటలకు స్టార్ మా లో మొదలైన బిగ్ బాస్ సీజన్ 5 లో పాల్గొంటున్న కంటెస్టెంట్స్ చూస్తే.. అబ్బా స్టార్ మాకి వీళ్ళు తప్ప ఎవరూ దొరకలేదా.. అనిపించకమానదు. యాంకర్ రవి, సిరి, షణ్ముఖ్ తప్ప క్రేజీ కంటెస్టెంట్స్ ఎవరూ ఈ లిస్ట్ లో కన్పించడం లేదు. ఏకంగా 19 మందిని హౌస్ లోకి పంపారు. అందులో ప్రియా, సీరియల్ ఆర్టిస్ట్స్, సింగర్ శ్రీరామ చంద్ర, యూట్యూబ్ స్టార్స్ కొంతమంది ఎవరికీ తెలియని చూడని ఫేస్ లు. అలాగే ఏజ్డ్ కంటెస్టెంట్స్. ఇక గ్లామర్ గా ఉంటుంది అనుకున్న బిగ్ బాస్ హౌస్ వెలవెలబోతోంది. 

యాంకర్ రవి ని స్టార్ మా ఫినాలే కంటెస్టెంట్స్ అంటూ సోషల్ మీడియాలో ప్రఛారం చేస్తుంది. ఇక హోస్ట్ నాగార్జున హడావిడి తప్ప బిగ్ బాస్ గ్రాండ్ ఎపిసోడ్ అంతగా అనిపించలేదు. అసలు కంటెస్టెంట్స్ ని చూసిన బుల్లితెర ప్రేక్షకులు అమ్మో వీళ్లా.. ఏమాత్రం క్రేజ్ లేని స్టార్స్ తో ఈ షో ని ఎలా చూడాలి.. ఈ సారి బిగ్ బాస్ హౌస్ లో పస లేదు బాస్ అంటూ పెదవి విరవడం ఒక ఎత్తైతే.. గత నెల రోజులుగా సోషల్ మీడియాలో ఎవరి పేర్లయితే.. ప్రచారంలో ఉన్నాయో.. వారే బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టడం చూస్తే ఈసారి బిగ్ బాస్ లీకులు షురూ అనక తప్పేలా లేదు. 

Bigg Boss 5 Telugu Grand Opening:

Bigg Boss Telugu 5 Launch

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ