బిగ్ బాస్ అంటేనే ఫైట్స్, రొమాన్స్, గిల్లికజ్జాలు అబ్బో ఇలాంటివి చాలానే ఉంటాయి. హిందీ లో బిగ్ బాస్ సీజన్స్ అన్ని సూపర్ హిట్ అయినా.. సౌత్ లో ఎందుకో బిగ్ బాస్ హిందీ అంత హిట్ కాలేకపోతుంది. తాజాగా బిగ్ బాస్ సీజన్ 5 తెలుగులో మొదలైంది. బిగ్ బాస్ సీజన్ 1,2,3,4 లు రసవత్తరంగానే ఉన్నా.. ఎక్కడో ఏదో వెలితి. ప్రతి సీజన్ లో నామినేషన్స్ ప్రక్రియలో పస లేదు. రొమాన్స్ లో రియాలిటీ లేదు అనేలా ఉన్నా.. ఈ సీజన్ కూడా ఫైట్స్, రొమాన్స్ లతోనే హైలెట్ చెయ్యాలని బిగ్ బాస్ ముందే ప్లాన్ చేస్తున్నాడు. పక్కా ప్లానింగ్ తోనే బిగ్ బాస్ సీజన్ పై గత రాత్రి అంగరంగ వైభవంగా స్టార్ మా లో నాగార్జున హోస్ట్ గా మొదలైపోయింది.
తాజాగా సీజన్ 5 మొదలు కావడం ఎలిమినేషన్స్ కి నామినేషన్ ప్రక్రియ కూడా స్టార్ట్ అయ్యింది. అంటే ఈ రోజు రాత్రి నామినేట్ అయ్యే సభ్యుల మధ్యన గొడవ స్టార్ట్ అయ్యింది. యాంకర్ రవి, షణ్ముఖ్, నటరాజ్ మాస్టర్, లోబో ల మధ్యన ఈ నామినేషన్ ప్రక్రియ గట్టిగనే జరిగినట్టుగా ప్రోమో కట్ చేసారు. రవి, లోబో, షణ్ముఖ్, నటరాజ్ ల మధ్యన హోరా హోరీగా ఈ ఎలిమినేషన్స్ కి నామినేషన్స్ జరిగినట్టుగా.. ఆ ప్రోమో లో చూపించారు. అంటే మొదటి ఎలిమినేషన్ ప్రక్రియనే.. ఇలా ఫైట్స్ పెట్టి అందరిలో ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేసేలా ప్లాన్ చేసింది బిగ్ బాస్ యాజమాన్యం.