Advertisementt

మాట నిలబెట్టుకున్న విజ‌య్‌ దేవ‌ర‌కొండ

Mon 06th Sep 2021 06:40 PM
vijay deverakonda,ananya pandey,ramya krishnan,ronit roy,vishu reddy,aali,makarand desh pandey and getup srinu  మాట నిలబెట్టుకున్న విజ‌య్‌ దేవ‌ర‌కొండ
Indian Idol Fame Shanmukha Priya Renders A Chartbuster In Vijay Deverakonda Liger మాట నిలబెట్టుకున్న విజ‌య్‌ దేవ‌ర‌కొండ
Advertisement
Ads by CJ

తెలుగు అమ్మాయి షణ్ముఖ ప్రియ ప్ర‌ముఖ రియాలిటీ షో ఇండియన్ ఐడల్ సీజన్ 12 ఫైనలిస్టులలో ఒక‌రు. ఇటీవ‌ల ఆమె అభిమాన న‌టుడు విజయ్ దేవరకొండ తనకు శుభాకాంక్షలు తెలిపినప్పుడు ఆమె ఒకర‌క‌మైన సంబ్రమాశ్చర్యాలకు లోనైంది. ఆ స‌మ‌యంలో తన తదుపరి చిత్రంలో పాడే  అవ‌కాశం ఇస్తాన‌ని హామీ ఇచ్చారు విజయ్ దేవరకొండ.

ఇప్పుడు విజ‌య్ అభిమానులు ఎంత‌గానో ఎదురుచూస్తున్న పూరిజ‌గ‌న్నాధ్ ద‌ర్శక‌త్వం వ‌హిస్తున్న‌ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ `లైగర్‌`లో షణ్ముఖ ప్రియతో  ఒక పాట పాడించ‌డం ద్వారా త‌న  వాగ్దానాన్ని నెరవేర్చుకున్నారు విజ‌య్ అలాగే షణ్ముఖ ప్రియ కల కూడా సాకారం అయ్యింది. అంతేకాకుండా షణ్ముఖ ప్రియ మరియు ఆమె తల్లిని త‌న నివాసంలో క‌లిశారు విజయ్‌. ఈ సంద‌ర్భంగా  విజయ్ దేవరకొండ తల్లి షణ్ముఖ ప్రియను సత్కరించారు. అలాగే  ఆమెకు కొన్ని బహుమతులు అందజేశారు.

మేము నీ పాటను సినిమాలో ఉంచుతాము. అది ఒక చక్కని పాట. దానిని వినడానికి ఎదురు చూస్తున్నాను. వచ్చే వారం  వింటానని అనుకుంటున్నాను. తొంద‌ర‌గా ఫైన‌ల్ మిక్సింగ్‌కి పంప‌మ‌ని వారిని అడుగుతాను అని విజయ్ దేవరకొండ షణ్ముఖ ప్రియకు చెప్పారు. ఈ చిత్రంలో బాలీవుడ్‌ బ్యూటీ అనన్యా పాండే హీరో యిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని ధర్మ ప్రొడక్షన్స్, పూరీ కనెక్ట్స్  ప‌తాకాల‌పై పూరీ జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్‌ జోహార్, అపూర్వ మోహతా  నిర్మిస్తున్నారు.

Indian Idol Fame Shanmukha Priya Renders A Chartbuster In Vijay Deverakonda Liger:

Indian Idol Fame Shanmukha Priya Renders A Chartbuster In Vijay Deverakonda Liger

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ