Advertisementt

ఎందుకింత అన్యాయం

Mon 06th Sep 2021 09:42 PM
bheemla nayak movie,pawan kalyan,rana,bheemla nayak makers  ఎందుకింత అన్యాయం
Bheemla Nayak Pawan Kalyan Role Highlighted For A Reason ఎందుకింత అన్యాయం
Advertisement
Ads by CJ

భీమ్లా నాయక్ సినిమాలో పవన్ కళ్యాణ్ తో పాటుగా రానా దగ్గుబాటి కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. మలయాళంలో బిజూ మీనన్, పృథ్వి రాజ్ నువ్వా - నేనా అని నటించిన అయ్యప్పన్ కోషియం సినిమా తెలుగులో రానా - పవన్ కాంబోలో భీమ్లా నాయక్ గా తెరకెక్కుతుంది. అయితే మలయాళంలో ఇద్దరు హీరోలు సమానమైన ఈగో కేరెక్టర్స్ లో నటిస్తే.. ఇక్కడ టైటిల్ దగ్గర నుండి అన్ని విషయాల్లోనూ రానా కి అన్యాయమే జరుగుతుంది. ఎక్కడ చూసినా పవన్ కళ్యాణ్ కటౌట్స్, పవన్ కళ్యాణ్ టీజర్, భీమ్లా నాయక్ గా పవన్ పోలీస్ గెటప్ ఫొటోస్, ఆఖరికి భీమ్లా నాయక్ గా టైటిల్ సాంగ్ అన్ని ఏది చూసినా పవన్ యే కనిపిసితున్నారు తప్ప రానా కనిపించింది లేదు. 

అడుగడుగునా పవన్ నామ జపమే. పవన్ ని ప్రమోట్ చేస్తూ సినిమా కి హైప్ క్రియేట్ చేస్తున్నారు. రానాకీ మంచి మాస్ ఇమేజ్ ఉంది. రానా కి పాన్ ఇండియా లెవల్లో క్రేజ్ ఉంది. అయినా రానా ని పక్కనబెట్టి ఇలా పవన్ ని హైలెట్ చెయ్యడం రానాకీ అన్యాయం చేసినట్టే. భీమ్లా నాయక్ గా పవన్ టీజర్ రిలీజ్ చేసాక.. స్పెషల్ గా రానా టీజర్ ఉంటుంది అన్నా.. ఎక్కడా రానా టీజర్ పై మేకర్స్ క్లారిటీ ఇవ్వడం లేదు. ఈ విషయంలో రానా దగ్గుబాటి ఫాన్స్ బాగా హర్ట్ అవుతున్నారు. తాజాగా రిలీజ్ చేసిన పవన్ పోలీస్ గన్ పట్టుకుని మోడరన్ బైక్ పై ఉన్న భీమ్లా నాయక్ పిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

Bheemla Nayak Pawan Kalyan Role Highlighted For A Reason:

Bheemla Nayak Pawan Role Highlighted For A Reason

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ