Advertisementt

ఈడీ విచారణలో మరో నటుడు

Thu 23rd Sep 2021 07:44 PM
actor nandu,ed office ed questioning  ఈడీ విచారణలో మరో నటుడు
Hero Nandu at ED Office ఈడీ విచారణలో మరో నటుడు
Advertisement
Ads by CJ

టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ప్రస్తుతం ఈడీ దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటివరకు డైరెక్టర్ పూరి జగన్నాధ్, హీరోయిన్ ఛార్మి, హీరోయిన్ రకుల్ ప్రీత్ లు ఈడీ విచారణకు హాజరయ్యారు. పూరి ని పది గంటల పాటు, ఛార్మి ని ఎనిమిది గంటల పాటు, రకుల్ ని ఆరు గంటల పాటు ఈడీ అధికారులు పప్రశ్నించారు. తాజాగా ఈ రోజు ఈడీ ఎదుట విచారణకు హీరో నందు హాజరయ్యారు. 

హీరో నందు ని గతంలోనూ ఎక్సయిజ్ పోలీస్ లు నోటీసు లు ఇచ్చి విచారించారు. ఇక ఇప్పుడు మనీ లాండరింగ్ కేసులో ఈడీ మరోసారి నందుకు నోటీసు లు ఇచ్చి విచారణకు పిలిచింది. ఈడీ అధికారులు కెల్విన్, జీశాన్‌లతో నందుకు పరిచయంపై ప్రశ్నిస్తున్నట్లుగా తెలుస్తుంది. కెల్విన్ ఇచ్చిన సమాచారం, కెల్విన్ మొబైల్‌లో కాంటాక్ట్ ఆధారంగా నందుకు ఈడీ అధికారులు సమన్లు జారీ చేశారు. ఎక్సైజ్‌ శాఖ ఇచ్చిన రిపోర్టులో నందు పేరు ఉండటం గమనార్హం. ఇక ప్రస్తుతం నందు బ్యాంక్ లావాదేవీలపై ఈడీ అధికారులు ఆరా తీస్తున్నారు. అలాగే అనుమానాస్ప‌ద లావాదేవీల‌పై నందు ని ఈడీ అధికారులు ప్ర‌శ్నిస్తున్నారు

Hero Nandu at ED Office :

Actor Nandu Reaches Ed Office For Questioning!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ