ప్రముఖ నటుడు శుభలేఖ సుధాకర్ మాతృమూర్తి, సినీ నేపధ్యగాయని ఎస్‌పీ శైలజ అత్తమ్మ అయిన ఎస్‌ఎస్ కాంతం (82) మంగళవారం చెన్నైలో కన్నుమూశారు. రెండేళ్ల క్రితమే తండ్రిని కోల్పోయిన శుభలేఖ సుధాకర నినన్ తల్లిని కోల్పోయారు. చెన్నై మహాలింగపురంలోని సుధాకర్ నివాసంలో తండ్రి సూరావజ్జల కృష్ణారావు, తల్లి ఎస్‌ఎస్ కాంతం ఉండేవారు. రెండేళ్ల క్రితం కృష్ణారావు మరణించారు. తల్లి కాంతం సుమారు మూడు నెలల క్రితం గుండెపోటుకు గురయ్యారు.
దీంతో ఆమె ఆరోగ్యం పూర్తిగా క్షీణించగా ఆమె మంగళవారం ఉదయం ఆమె మృతి చెందారు. కృష్ణారావు, కాంతం దంపతులకు ముగ్గురు కుమారులు కాగా సుధాకర్ పెద్దవారు. రెండో కుమారుడు మురళీ దత్తుపోయి వైజాగ్‌లో, మూడో కుమారుడు సాగర్ అట్లాంటాలో స్థిరపడ్డారు. ఈ రోజు అంటే బుధవారం మధ్యాహ్నం చెన్నైలో ఆమె అంత్యక్రియలు జరుగనున్నాయి