మనీ లాండరింగ్ కేసులో పలువురు సెలబ్రిటీస్ ని ఈడీ విచారణకు తెలిసిందే. ఇప్పటికే డైరెక్టర్ పూరి జగన్నాధ్, ఛార్మి, రకుల్ ప్రీత్, హీరో నందు తో పాటుగా.. ఈ కేసులో ప్రధాన సూత్రధారి కెల్విన్ కూడా ఈడీ విచారణకు హాజరయ్యాడు. ఇక నేడు ఈడీ విచారణలో భాగంగా హీరో రానా ఈడీ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యాడు. రానా ఈడీ ఆఫీస్ కి చేరుకునేలోపే మీడియా రానా ఇంటి ఎదుట కాపు కాసింది. రానా ఇంటి నుండి ఎప్పుడు బయటికి వచ్చి ఈడీ ఆఫీస్ కి బయలు దేరుతాడా.. అని ఎదురు చూసారు మీడియా వాళ్ళు.
అయితే ఈ కేసులో రానా పేరు మొదట లేకపోయినా.. తాజాగా రానా పేరు ఈ మనీ లాండరింగ్ లో బయట పడింది. నటుడు నవదీప్ తో రానా జరిపిన చాటింగ్, ఎఫ్ 3 క్లబ్ వ్యవహారాలు.. బ్యాంకు ఖాతాల లావాదేవీలపై రానా ని ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు. ఇక బుధవారం ఉదయం 10.30 ఆ ప్రాంతంలో రానా దగ్గుబాటి ఈడీ విచారణ కోసం ఈడీ ఆఫీస్ కి చేరుకున్నాడు. రానా తన పర్సనల్ సిబ్బందితో ఈడీ ఆఫీస్ కి వచ్చాడు. మీడియా తో ఏం మాట్లాడకుండానే రానా ఆఫీస్ లోపలి వెళ్ళిపోయాడు. అంత పెద్ద నిర్మాత కొడుకు, హీరో అయ్యుండి రానా ఇలాంటి కేసులో హైలెట్ అవడంతో దగ్గుబాటి అభిమానులు కలత చెందుతున్నారు.