Advertisementt

7 గంటలు పాటు ఈడీ విచారణలో రానా

Wed 08th Sep 2021 07:22 PM
rana daggubati,questioned,ed,tollywood drugs case  7 గంటలు పాటు ఈడీ విచారణలో రానా
Rana Daggubati questioned by ED 7 గంటలు పాటు ఈడీ విచారణలో రానా
Advertisement
Ads by CJ

టాలీవుడ్ ని షేక్ చేస్తున్న మనీ లాండరింగ్ కేసు.. టాలీవుడ్ లోని కీలక నటుల చుట్టూనే తిరుగుతుంది. రకుల్, రానా ల పేర్లు కొత్తగా మనీ లాండరింగ్ కేసులో వినిపించిన పేర్లు. ఇప్పటికే రకుల్ ప్రీత్ విచారణ, పూరి, ఛార్మి, నందు విచారణలు పూర్తి కాగా.. ఈ రోజు బుధవారం హీరో రానా ఈడీ విచారణలో పాల్గొన్నాడు. ఉదయం 10.30 కే ఈడీ ఆఫీస్ కి చేరుకున్న రానా చేతిలో చిన్న బాగ్ ఉంది. ఇక 11 గంటల నుండి సాయంత్రం ఆరు గంటల దాకా అంటే.. దాదాపుగా 7 గంటల పాటు రానా ని ఈడీ అధికారులు ప్రశ్నించారు. ఇక రానా తో పాటుగా ఆయన ఆడిటర్ కూడా ఈడీ విచారణకు హాజరయ్యాడు. 

ఈ విచారణలో.. రానా 2015 నుండి 17 వరకు జరిగిన బ్యాంకు లావాదేవీల ఆడిటింగ్ ని ఈడీ అధికారులకు సమర్పించినట్టుగా, నవదీప్ తో రానా సంబంధాలు గురించి ఈడీ అధికారులు రానాని ప్రశ్నించినట్లుగా తెలుస్తుంది. అంతేకాకుండా డ్రగ్స్ సరఫరా దారుడు కెల్విన్ తో రానాకున్న సంబంధాలు గురించి ఈడీ అధికారులు రానా ని ప్రశ్నించగా.. రానా మాత్రం కెల్విన్ ఎవరో తనకి తెలియదని చెప్పినట్టుగా తెలుస్తుంది. అలాగే ఎఫ్‌ క్లబ్ విషయమై రానాను ఈడీ అధికారులు పలు ప్రశ్నలు అడిగినట్లుగా సమాచారం. ఈడీ విచారణ తర్వాత రానా మీడియా తో మాట్లడకుండానే వెళ్ళిపోయాడు. 

Rana Daggubati questioned by ED:

Rana Daggubati questioned by ED in Tollywood drugs case