బిగ్ బాస్ అంటేనే గ్లామర్. కాస్త పేరున్న సెలెబ్రేటిస్ చేసే స్కిన్ షో నే బిగ్ బాస్ కి మంచి రేటింగ్ తెస్తుంది. అంతేకాదు.. బిగ్ బాస్ లో ప్రేమికులుగా ప్రొజెక్ట్ అయితే.. వారికి ఎక్కువ స్క్రీన్ స్పేస్ దొరుకుతుంది అనేది బిగ్ బాస్ ఫస్ట్ సీజన్ నుండే చూస్తున్నాం. నాగార్జున హోస్టింగ్ లో తాజాగా గత ఆదివారమే మొదలయిన బిగ్ బాస్ సీజన్ 5 లో ఏకంగా రికార్డ్ స్థాయిలో 19 మంది కంటెస్టెంట్స్ అడుగుపెట్టారు. అందులో గ్లామర్ గర్ల్స్ చాలా తక్కువ, ప్రియా, ఇంకా కార్తీక దీపం భాగ్యం, సరయు, కాజల్ ఇలా అందరూ మాములుగా కనిపించేవారు తప్ప ఎవరూ స్కిన్ షో చేసే వారు లేరు.
సిరి ఉన్నా అంతంత మాత్రమే. యాంకర్ వర్షిణి బిగ్ బాస్ కి వచ్చేస్తుంది.. గ్లామర్ కి కొదవ లేదు అనుకుంటే వర్షిణి బిగ్ బాస్ లోకి రాలేదు. దానితో నిజంగానే బిగ్ బాస్ కి గ్లామర్ కరువైంది. గత సీజన్ లో దేత్తడి హారిక, మోనాల్, అరియనాలు స్కిన్ షో తో రెచ్చిపోయారు. గ్లామర్ గా మోనాల్ గజ్జర్ బిగ్ బాస్ సీజన్ 4 కి మెయిన్ హైలెట్ అయ్యింది. మోనాల్ అందాలు వీకెండ్ ఎపిసోడ్స్ కి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి.
కానీ ఈ సీజన్ లో ఒక్క గ్లామర్ గర్ల్ కూడా లేదు. బిగ్ బాస్ మొత్తం లేడీస్ ఏడుపులు, జెంట్స్ వెకిలి కామెడీ, ఏడుపులు పెడబొబ్బలు తప్ప ఆయమన్న గ్లామర్ ని చూపించేవాళ్లే లేరు. అందుకే అనేది గ్లామర్ లేని బిగ్ బాస్ అనేది.