పవన్ కళ్యాణ్ - హరీష్ శంకర్ కాంబో అంటేనే.. పవర్ ఫుల్. వారి కాంబోలో గతంలో వచ్చిన గబ్బర్ సింగ్ అంచనాలను మించి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఆ సినిమాలో పవర్ ఫుల్ కామెడీ పోలీస్ ఆఫీసర్ గా పవన్ కళ్యాణ్ నటన అద్భుతమే. సినిమా కూడా అదరగొట్టేసే హిట్ అవడంతో.. ఇప్పుడు రిపీట్ కాబోతున్న ఈ కాంబో పై భారీ అంచనాలు పెరిగిపోయాయి. అయితే హరీష్.. పవన్ కళ్యాణ్ ని భవదీయుడు - భగత్ సింగ్ గా చూపించబోతున్నాడు. ఇటు టైటిల్ చూస్తే చాలా సాఫ్ట్ గా భవదీయుడు భగత్ సింగ్ అంటుంటే.. పవన్ కళ్యాణ్ లుక్ మాత్రం పవర్ ఫుల్ గా కనిపిస్తుంది.
బైక్ మీద జీన్స్, జర్కిన్ డ్రెస్ తో కూర్చుని ఒక చేతితో టీ తాగుతూ.. మరో చేతిలో స్పీఎకర్ తో చాలా పవర్ ఫుల్ గా కనిపిస్తున్నాడు. చాలా యంగ్ లుక్ లో సూపర్ మేకోవర్ తో పవన్ నిజంగా ఇరగదీసేసాడు. అందుకే ఫాన్స్ కూడా టైటిల్ అంత సాఫ్ట్ కాదు.. ఈ సినిమాలో పవన్ కేరెక్టర్ అంటున్నారు. మరి భవదీయుడు భగత్ సింగ్ గా పవన్ కళ్యాణ్ పెరఫార్మెన్సు ఎలా ఉండబోతుందో కానీ.. పవన్ లుక్ మాత్రం అదిరింది అంటున్నారు ఫాన్స్.




నభ నటేష్ బ్యూటిఫుల్ హాఫ్ సారీ పిక్స్ 
Loading..