రజినీకాంత్ - శివ కాంబోలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న అన్నాత్తే సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అవడమే కాదు.. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లోకి దిగిపోయారు. మార్చ్ నెలలో దాదాపుగా 45 రోజుల పాటు హైద్రాబాద్ లోని రామోజీ ఫిలిం సిటిలో ఏకధాటిగా చిత్రీకరణ జరుపుకున్న అన్నాత్తే మూవీ.. తర్వాత సెకండ్ వెవ్ కరోనా కారణముగా షూటింగ్ వాయిదా పడడం, రజినీకాంత్ అమెరికా ప్రయాణంతో కొద్దిగా గ్యాప్ వచ్చింది. ఇక లాస్ట్ షెడ్యూల్ ని కలకత్తాలో ముగించేసిన టీం.. తాజాగా వినాయక చవితి స్పెషల్ గా అన్నాత్తే ఫస్ట్ లుక్ రివీల్ చేసింది.
అన్నాత్తే ఫస్ట్ లుక్ లో సూపర్ స్టార్ రజినీకాంత్ పట్టు పంచె కట్టుకుని స్టయిలిష్ గా ట్రెడిషనల్ గా సాఫ్ట్ గా కనిపింఛారు. కానీ అన్నాత్తే సెకండ్ లుక్ లో రజినీకాంత్ రఫ్ గా బైక్ పై కూర్చున్నారు. యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా పక్కా మాస్ కమర్షియల్ గా ఉండబోతుంది అనేది అన్నాత్తే సెకండ్ లుక్ చూస్తే అర్ధమవుతుంది. ఈ సినిమాలో రజినీకాంత్ కి జోడిగా నయనతార నటిస్తుంటే.. మీనా, కీర్తి సురేష్, ఖుష్బూ లు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. అన్నాత్తే మూవీ నవంబర్ 11 న దీపావళి స్పెషల్ గా రిలీజ్ కాబోతుంది.