Advertisementt

రోడ్డు ప్రమాదంలో సాయి ధరమ్ కి తీవ్ర గాయాలు

Fri 10th Sep 2021 10:01 PM
sai dharam tej,sai tej,sai tej meets with an accident,madhapur,mega hero,road accident,sports bike  రోడ్డు ప్రమాదంలో సాయి ధరమ్ కి తీవ్ర గాయాలు
Mega Hero Involved in a fatal accident రోడ్డు ప్రమాదంలో సాయి ధరమ్ కి తీవ్ర గాయాలు
Advertisement
Ads by CJ

మెగా హీరో సాయి ధరమ్ తేజ్.. రిపబ్లిక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు. రిపబ్లిక్ ప్రమోషన్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. అంతలోనే ఆయన రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. వినాయక చవితి రోజున సాయి ధారణమ్ తేజ్ రోడ్డు ప్రమాదంలో గాయపడడం ఆయన అభిమానులను, సినీ ప్రముఖులని షాక్ కి గురిచేసింది. హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45 దుర్గమ్మ చెరువు కేబుల్ బ్రిడ్జ్ మీదుగా గచ్చిబౌలి వైపు స్పోర్ట్స్ బైక్ నడుపుతూ బైక్ మీద నుండి కింద పడిపోవడంతో సాయి ధరమ్ కి తీవ్ర గాయాలపాలైనట్లుగా తెలుస్తుంది. 

ప్రమాదం జరిగిన వెంటనే ఆయన్ని హుటా హుటిన మాదాపూర్ లోని మెడికవర్ హాస్పిటల్ కి తరలించి వైద్యం అందిస్తున్నారు. సాయి ధరమ్ తేజ్ కుడి కన్ను పైన, ఛాతి పైన, పొట్ట భాగంలో తీవ్ర గాయాలైనట్టుగా తెలుస్తుంది. సాయి ధరమ్ తేజ్ కి ప్రమాదం జరిగిన వెంటనే ఆయన అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ స్పృహలో లేరని.. అయితే సాయి ధరమ్ కి ప్రాణాపాయం తప్పినట్లుగా. డాక్టర్స్ ఆయన కుటుంబ సభ్యులకి చెప్పినట్టుగా తెలుస్తుంది. 

Mega Hero Involved in a fatal accident:

Sai Dharam Tej meets with an accident

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ