సాయి ధరమ్ తేజ్ కి యాక్సిడెంట్ విషయం తెలుసుకున్న మెగా ఫ్యామిలీ మొత్తం ఆయనకి ప్రధమ చికిత్స అందించిన మెడికవర్ హాస్పిటల్ కి వచ్చేసారు. పవన్ కళ్యాణ్ మేనల్లుడి ఆరోగ్య పరిస్థితి తెలుసుకునేందుకు హుటాహుటిన మాదాపూర్ వచ్చారు. ఇక వరుణ్ తేజ్, సందీప్ కిషన్, నిహారిక, వైష్ణవ తేజ్, అల్లు అరవింద్, త్రివిక్రమ్ లు సాయి ధరం తేజ్ పరామర్శకు వచ్చారు. సాయి ధరమ్ తేజ్ ని మాదాపూర్ నుండి ఫిల్మ్ నగర్ అపోలోకి మెరుగైన వైద్యం కోసం తరలించారు.
పవన్ కళ్యాణ్ గత రాత్రి నుండి అపోలో హాస్పిటల్ లోనే ఉండగా.. మెగాస్టార్ చిరు భార్య సురేఖ తో కలిసి అపోలోకి వచ్చారు. గత రాత్రి నుండి ఫ్యామిలీ మొత్తం అపోలో హాస్పిటల్ లోనే ఉన్నారు. తాజాగా ఈ రోజు ఉదయం రామ్ చరణ్ ఆయన భార్య ఉపాసన తో కలిసి అపోలో కి వచ్చారు. సాయి ధరమ్ ఆరోగ్యం, నిలకడగానే ఉంది, కానీ 48 గంటల పాటు వైద్యులపర్యవేక్షలో ఉండాలని, సాయి ధరమ్ కి షోల్డర్ బోన్ విరిగింది అని వైద్యులు ప్రకటించారు. ఇక అభిమానులు ఎవరు ఆందోళన పడవద్దని మెగాస్టార్ చిరు.. సాయి ధరమ్ కోలుకుంటున్నట్టుగా ట్వీట్ చేసారు.