Advertisementt

సీటీ కొట్టించిన సీటిమార్

Sat 11th Sep 2021 11:56 AM
gopichand,seetimaarr movie,maas commercial hit,tamanna,sampath nandi,jwala reddy song  సీటీ కొట్టించిన సీటిమార్
Seetimaarr Emerges as Unstoppable Blockbuster సీటీ కొట్టించిన సీటిమార్
Advertisement
Ads by CJ

సంపత్ నంది - గోపీచంద్ కాంబోలో మాస్ మూవీగా తెరకెక్కిన సీటిమార్ మూవీ నిన్న వినాయక చవితి స్పెషల్ గా థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది. గోపీచంద్ ని, సీటిమార్ కథ కి కమర్షియల్ హంగులు జోడించి సీటిమార్ ని తెరకేక్కిన్చారు దర్శకుడు సంపత్ నంది. పక్కా ప్రమోషన్స్ తో బరిలోకి దిగిన  సీటిమార్ ఫస్ట్ షో కే పాజిటివ్ టాక్ తెచ్చుకుని.. హిట్ మూవీ గా నిలిచింది. క్రిటిక్స్ సీటిమార్ కి పాజిటివ్ రివ్యూస్ ఇవ్వడం, సీటిమార్ థియేటర్స్ పండగ పూట హౌస్ ఫుల్ ప్రేక్షకులతో కళకళలాడడంతో సీటిమార్ బాక్సాఫీసు దగ్గర హిట్ కొట్టేసింది. 

కబడ్డీ కోచ్ గా గోపీచంద్ గ్రామీణ ప్రాంతంలో ఉన్న కొందరి యువతులను ఎలా ఛాంపీయన్స్‌గా మార్చాడు, దానికోసం ఎలాంటీ కష్టనష్టాలను, ఒడిదుడుకులని ఎదుర్కోవాల్సి వచ్చిందనేది సీటిమార్ కథ. మిల్కి బ్యూటీ తమన్నా గ్లామర్ గా అదరగొట్టేసింది. జ్వాలా రెడ్డి పాటకి ఫాన్స్, ప్రేక్షకులు విజిల్స్ వేస్తూ థియేటర్స్ లో చేసిన సందడి చూస్తే మళ్ళీ థియేటర్స్ కి పూర్వ వైభవం వచ్చినట్టే కనిపించింది. 

ఇక వినాయక చవితికి గోపిచంద్ సీటిమార్ ఒక్కటే థియేటర్స్ లో రిలీజ్ అవడం.. థియేటర్స్ మొత్తం ప్రేక్షకులతో కిటకిటలాడడంతో సీటిమార్ పక్కా కమర్షియల్ హిట్ అవడమే కాదు.. కలెక్షన్స్ పరంగా మేకర్స్ కి ఈ సినిమా లాభాలు తెస్తుంది అనడంలో సందేహమే లేదు. దర్శకుడు సంపత్ నంది సీటిమార్ తో ఫాన్స్ నే కాదు.. ప్రేక్షకులతోను సీటీ కొట్టించాడు. 

Seetimaarr Emerges as Unstoppable Blockbuster:

Gopichand Seetimaarr Maas Commercial Hit

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ