Advertisementt

గ‌ల్లీ రౌడీ ట్రైల‌ర్‌ రివ్యూ

Sun 12th Sep 2021 05:53 PM
megastar chiranjeevi,chiru launches gully rowdy trailer,sundeep kishan,sundeep kishan gully rowdy  గ‌ల్లీ రౌడీ ట్రైల‌ర్‌ రివ్యూ
Gully Rowdy Trailer Talk గ‌ల్లీ రౌడీ ట్రైల‌ర్‌ రివ్యూ
Advertisement
Ads by CJ

కోవిడ్ సెకండ్ వేవ్ ప్రభావం తగ్గుముఖం పట్టిన తర్వాత సినిమా థియేట‌ర్స్‌లో చాలా సినిమాలు వ‌చ్చాయి. ప్రేక్ష‌కుల‌ను న‌వ్వించాయి. అయితే మేం ఏకంగా న‌వ్వులతో సెప్టెంబ‌ర్ 17న‌ దాడి చేయ‌బోతున్నాం అని అంటున్నారు గ‌ల్లీరౌడీ అండ్ టీమ్‌. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సందీప్ కిషన్, నేహా శెట్టి హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి బాక్సాఫీస్ వ‌ద్ద సెన్సేష‌న‌ల్ హిట్ సాధించిన ఎన్నో సూప‌ర్ డూప‌ర్ హిట్ చిత్రాల స‌క్సెస్‌లో  కీల‌క పాత్ర‌ను పోషించిన స్టార్ రైట‌ర్  కోన వెంక‌ట‌న్ గల్లీ రౌడీచిత్రానికి స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హిరించ‌డ‌మే కాకుండా స్క్రీన్‌ప్లే అందించారు. 

ప‌క్కా హిలేరియ‌స్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా అన్ని ఎలిమెంట్స్ ఉన్న విందుభోజ‌నంలా ప్రేక్ష‌కుల‌ను సంతోష‌పెట్ట‌డానికి సెప్టెంబ‌ర్ 17న మీ ద‌గ్గ‌రున్న థియేట‌ర్స్‌లో గ‌ల్లీరౌడీ సంద‌డి మొద‌లు కానుంది. ఈ న‌వ్వుల సంద‌డికి శాంపిల్ ఎలా ఉంటుందో చూపించడానికి మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ట్రైల‌ర్‌ను విడుద‌ల చేసింది చిత్ర యూనిట్. 

ట్రైలర్ లోకి వెళితే.. నీకు తెలిసిన రౌడీ ఎవ‌రైనా ఉన్నారా? అని వైవా హ‌ర్ష‌ను హీరోయిన్‌ అడిగితే నా ఫ్రెండే పెద్ద రౌడీ అనే డైలాగ్‌తో ట్రైల‌ర్ మొద‌ల‌వుతుంది. 

సందీప్ కిష‌న్ ఇంట్రెడెక్షన్ ఓ రేంజ్‌లో ఎంట‌ర్‌టైనింగ్‌గా అనిపిస్తుంది. అదే హీరోయిన్ ఇత‌ను నిజంగానే రౌడీనా?  అని ప్ర‌శ్నిస్తే.. రోజూ  పులిగోరు అవీ ఇవీ పెడ‌తావు క‌దా అవెక్క‌డ అంటూ వైవాహ‌ర్ష ప్ర‌శ్నించ‌డం దానికి బ‌దులుగా సందీప్ మొదటిసారి కాఫీషాప్‌కు వ‌స్తున్నా క‌దా, కాస్త క్లాస్‌గా ఉందామని అని బ‌దులిస్తాడు. దానికి రివ‌ర్స్‌గా వైవా హ‌ర్ష ఏసుకోరా రౌడీ అంటే ఎవ‌రూ న‌మ్మ‌ట్లేదు అని చెప్పే డైలాగ్‌తోనే హీరో క్యారెక్ట‌ర్ ఏంటి?  త‌ను ఎలాంటి ప‌రిస్థితుల‌ను ఫేస్ చేస్తున్నాడ‌నే విష‌యం రివీల్ అవుతుంది. 

హీరోయిన్ నేహాశెట్టి ప్రేమలో హీరో ఆమె వెంటపడటం.. 

వాడు రౌడీ.. వాళ్ల నాన్న రౌడీ... వాళ్ల తాత రౌడీ.. అంటూ హీరో గురించి హీరోయిన్ బిల్డప్ ఇవ్వడం 

రౌడీలను సందీప్ కిషన్ చితక్కొట్టడం

పోలీసులు నాపై రౌడీ షీట్ ఓపెన్ చేస్తే నాకు పాస్‌పోర్ట్ కూడా రాదు క‌దా.. అని సందీప్ కిష‌న్ అంటే ఒక్క పాస్ పోర్ట్ ఏంటి?  రేష‌న్ కార్డ్ కూడా రాదు అంటూ వైవా హ‌ర్ష చెప్పే డైలాగ్ వింటే హీరోకి రౌడీ కావ‌డం కంటే బ‌య‌ట దేశాల‌కు వెళ్లాల‌నే డ్రీమ్ ఉండ‌టం. కానీ ప్రేమ కోసం రౌడీ మారుతాడ‌నే సంగ‌తి అర్థ‌మ‌వుతుంది. 

బాబీ సింహ పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో క‌నిపిస్తున్నాడు. త‌ను రౌడీల‌ను ఎన్‌కౌంటర్ చేయ‌డం 

కామెడీ కోణంలో సాగే రాజేంద్ర ప్ర‌సాద్‌, స‌హా ప్ర‌తి పాత్ర ఎంట‌ర్‌టైనింగ్‌లోనే సాగుతుంది

ట్రైలర్‌లోనే ఈ రేంజ్ కామెడీ  ఉంటే, ఇక సినిమా ఎలా ఉండ‌బోతుందోన‌నే ఆస‌క్తి ప్రేక్ష‌కుల్లో క్రియేట్ చేసేలా ట్రైల‌ర్ ఆస‌క్తిక‌రంగా, ఎంట‌ర్‌టైనింగ్‌గా క‌నిపిస్తుంది. న‌ట‌కిరిటీ రాజేంద్ర ప్ర‌సాద్ ఇందులో ఇంపార్టెంట్ రోల్‌ను పోషించిన ఈ చిత్రంలో కోలీవుడ్ యాక్టర్ బాబీ సింహ ఓ కీలక పాత్రలో నటించారు. 

megastar chiranjeevi,chiru launches gully rowdy trailer,sundeep kishan,sundeep kishan gully rowdymegastar chiranjeevi,chiru launches gully rowdy trailer,sundeep kishan,sundeep kishan gully rowdymegastar chiranjeevi,chiru launches gully rowdy trailer,sundeep kishan,sundeep kishan gully rowdymegastar chiranjeevi,chiru launches gully rowdy trailer,sundeep kishan,sundeep kishan gully rowdy

Gully Rowdy Trailer Talk:

Megastar Chiranjeevi launches Gully Rowdy Trailer 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ