Advertisementt

ఫస్ట్ హెల్త్ - తర్వాతే మూవీస్

Sun 12th Sep 2021 08:43 PM
bigg boss season 4,bigg boss,abhijeet,abhijeet chit chat with fans  ఫస్ట్ హెల్త్ - తర్వాతే మూవీస్
Bigg Boss Abhijeet suffering with health issues ఫస్ట్ హెల్త్ - తర్వాతే మూవీస్
Advertisement
Ads by CJ

ముందు ఆరోగ్యం.. తర్వాతే సినిమాలు. ఈ మాటన్నది ఎవరో కాదు.. బిగ్ బాస్ సీజన్ 4 విన్నర్ అభిజిత్. బిగ్ బాస్ సీజన్ 4 ముగిసి ఏడాది గడుస్తున్నా.. విన్నర్ అభిజిత్ కొత్త సినిమా ముచ్చట చెప్పింది లేదు. అసలు ఏం చేస్తున్నాడో ఎవరికీ తెలియదు. బిగ్ బాస్ తో ఎనలేని అభిమాన గణాన్ని సంపాదించుకున్న అభిజిత్.. తాజాగా సోషల్ మీడియా లైవ్ లోకి వచ్చాడు. దానితో ఉదయం నుండే అభిజిత్ ఇండియా వైడ్ గా ట్విట్టర్ లో ట్రెండ్ అవుతున్నాడు. అభిమానులు అభిజిత్ సినిమాల విషయమై, ఇంకా ఆయన హెల్త్ విషయాలను అడిగారు. 

ఇక బిగ్ బాస్ సీజన్ 4 నుండి విన్నర్ గా బయటికి వచ్చాక అభిజిత్ ఫుల్ బిజీ అవుతాడు, మూడు నాలుగు ప్రాజెక్ట్స్ లైన్ లో పెట్టేసాడు, అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లోనే అభిజిత్ నాలుగు ప్రాజెక్ట్స్ కి సైన్ చేసాడు.. అబ్బో చాలా ప్రచారం జరిగింది. కానీ అభిజిత్ భుజం నొప్పితో హాస్పిటల్ లో జాయిన్ అయ్యాడు. తాజాగా తనకి కాలుకి జరిగిన సర్జరి రిపోర్ట్స్ బయట పెట్టాడు. ఇంకా కొన్ని ఆరొగ్య సమస్యలతో అభిజిత్ ఎమన్నా బాధపడుతున్నాడో.. లేదో.. తెలియదు కానీ.. అభిమానులు సినిమాల గురించి అడిగితె.. ముందు ఆరోగ్యం.. తర్వాతే సినిమాలు అన్నట్టుగా మాట్లాడాడు. ముందు ఆరోగ్యం సెట్ అయితే.. తర్వాత ఏదైనా చేయ్యవచ్చు అని అన్నాడు. 

Bigg Boss Abhijeet suffering with health issues:

Bigg Boss Abhijeet chit chat with fans

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ