Advertisementt

నటుడు ఉత్తేజ్ భార్య అనారోగ్యంతో మృతి

Mon 13th Sep 2021 11:07 AM
uttej,uttej wife padmavati,padmavati passes away,health issues,cancer  నటుడు ఉత్తేజ్ భార్య అనారోగ్యంతో మృతి
Uttej Wife Padmavati Passes away నటుడు ఉత్తేజ్ భార్య అనారోగ్యంతో మృతి
Advertisement
Ads by CJ

ప్రముఖ నటుడు ఉత్తేజ్‌ ఇంట విషాదం చోటుచేసుకుంది. ఉత్తేజ్ భార్య పద్మావతి అనారోగ్యంతో ఈ రోజు ఉదయమే కన్నుమూశారు. కొంతకాలం నుంచి అనారోగ్యంతో ఇబ్బందిపడుతున్న ఆమె బసవతారకం క్యాన్సర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం తుది శ్వాస విడిచారు. ఉత్తేజ్‌ చేసే సేవా కార్యక్రమాల్లో పద్మావతి భాగస్వామి అయ్యేవారు.

ఉత్తేజ్‌ కొన్నేళ్ల క్రితమే మొదలు పెట్టిన మయూఖ టాకీస్‌ ఫిల్మ్‌ యాక్టింగ్‌ స్కూల్‌ నిర్వహణలో ఆమె విధులు నిర్వర్తించేవారు. భార్య ఆకస్మిక మరణంతో ఉత్తేజ్‌, ఆయన ఇద్దరు కూతుళ్లు, కుటుంబసభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు. విషయం తెలుసుకున్న చిరంజీవి, ప్రకాశ్‌రాజ్‌, జీవిత రాజశేఖర్‌ ఆస్పత్రికి చేరుకుని ఉత్తేజ్‌ని పరామర్శించారు. ఆమె మరణం పట్ల సంతాపం ప్రకటించారు. ఉత్తేజ్ భార్య పద్మావతి అంత్యక్రియలు ఈ రోజు మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలకు మహాప్రస్థానంలో జరగనున్నాయి.

Uttej Wife Padmavati Passes away:

Uttej Wife Padmavati Passes away due to Cancer

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ