నాగ చైతన్య - సమంత విడాకులు తీసుకోబోతున్నారని ఓ ప్రముఖ వెబ్ సైట్ లో న్యూస్ రావడము.. అది కాస్త వైరల్ అవ్వడము చూసాము. ఆ వెబ్ సైట్ స్టిల్ ఇప్పటికి చైతు - సామ్ ల విడాకుల మేటర్ వదల్లేదు. అసలు నాగ చైతన్య కానీ, సమంత కానీ, అక్కినేని కాంపౌండ్ కానీ ఈ విషయమై స్పందించడం లేదు. కానీ ఆ ప్రముఖ వెబ్ సైట్ పదే పదే వాళ్ళ విడాకుల మేటర్ ని కెలుకుతుంది. అయితే తాజాగా సమంత నాగ చైతన్య లవ్ స్టోరీ పై వేసిన ట్వీట్ చూసాక కూడా వాళ్ళు విడాకులు తీసుకుంటున్నారంటే ఎవరు నమ్మరు. కానీ మరోపక్క అపనమ్మకం కలిగేలా ఆ ట్వీట్ ఉంది.
నాగ చైతన్య - సాయి పల్లవి కాంబోలో తెరకెక్కిన లవ్ స్టోరీ మూవీ ట్రైలర్ నేడు సోమవారం రిలీజ్ చేసింది టీం. అయితే లవ్ స్టోరీ ట్రైలర్ విషయాన్నీ చైతు సోషల్ మీడియా ద్వారా షేర్ చెయ్యగా.. దానిని రీ ట్వీట్ చేస్తూ విన్నర్.. లవ్ స్టోరీ టీం కి ఆల్ ద బెస్ట్ చెప్పింది సమంత. అయితే ఎక్కడా చైతన్య పేరు కానీ, చైతన్య ని టాగ్ చెయ్యడం కానీ చెయ్యలేదు సమంత. మరి నిజంగా చైతు తో సామ్ విడాకులు కోరుకుంటుంటే.. నాగ చైతన్య లవ్ స్టోరీ పై కామ్ ఉంటుంది కానీ, ఇలా విన్నర్ అంటూ ట్వీట్ చెయ్యదుగా.. అంటున్నారు అక్కినేని అభిమానులు. కొందరేమో.. చైతు ని టాగ్ చెయ్యలేదు, చైతు ని పొగడలేదు.. మరి ఇదేంటి అంటున్నారు.