పెళ్లి తర్వాత ఆర్.ఆర్.ఆర్, గమనం సినిమాలో నటించిన హీరోయిన్ శ్రియ కొన్నాళ్లుగా భర్త తో కలిసి స్పెయిన్ లోనే ఉంటుంది. తాజాగా శ్రియ గమనం మూవీ ప్రమోషన్స్ కోసం హైదరాబాద్ లోనే ఉంటున్న శ్రియ... తన భర్త తో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ రోజు(మంగళవారం) ఉదయం వీఐపీ దర్శనంలో స్వామివారిని దర్శించుకున్న శ్రియ దంపతులను ఆలయ అర్చకులు ఆశీర్వదించి తీర్ధప్రసాదాలు అందచేశారు.
స్వామి దర్శనం అనంతరం శ్రియ మీడియాతో మాట్లాడుతూ కోవిడ్ కారణంగా రెండు సంవత్సరాలుగా స్వామివారిని దర్శించుకోలేకపోయానని అన్నారు. ఇక ఆమె భర్త ఆండ్రీ కొశ్చేవ్ ఆలయం ముందు శ్రియకి ముద్దు పెట్టి తన ప్రేమను వ్యక్తపరిచారు. ఇక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం శ్రియ ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లతో రాజమౌళి తెరకెక్కిస్తోన్న చిత్రం ఆర్‌ఆర్‌ఆర్ లో అజయ్ దేవగణ్‌కు జోడీగా నటిస్తున్న విషయం తెలిసిందే. అదే విధంగా గమనం అనే మల్టీలాంగ్వేజ్ చిత్రంలో నటిస్తున్నారు.