బాలకృష్ణ - బోయపాటి కాంబోలో హ్యాట్రిక్ మూవీ గా తెరకెక్కుతున్న అఖండ మూవీ సాంగ్స్ షూట్ కోసం టీం మొత్తం గోవా వెళ్ళింది. బాలకృష్ణ హీరోయిన్ ప్రగ్య జైస్వాల్ తో పాటుగా బోయపాటి అఖండ టీం మొత్తం గోవా లో ఎంజాయ్ చేస్తున్నారు. అయితే అఖండ రిలీజ్ డేట్ కోసం ఎదురు చూస్తున్న ఫాన్స్ కి మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఓ గుడ్ న్యూస్ చెప్పాడు. #Akhanda BGM Fireworks Starting TOM 🎬⭐
#Akhandafirstsingle updates coming ur way very soon 💿🎵
This combo of #NBK 🦁GAARU & #Boyapati GAARU SHINES AGAIN 📢⭐⭐⭐⭐⭐
అఖండ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఫైర్ వర్క్ స్టార్ట్ టుమారో.. అఖండ ఫస్ట్ సింగిల్ అప్ డేట్ చాల తొందరలోనే.. బాలయ్య - బోయపాటి కాంబో మెరుపులు మరోసారి అంటూ థమన్ సోషల్ మీడియాలో ట్వీట్ చెయ్యడంతో నందమూరి అభిమానుల ఆనందానికి పట్ట పగ్గాలు లేవు. అఖండ నుండి ఎలాంటి అప్ డేట్స్ లేకపోయేసరికి నందమూరి ఫాన్స్ వర్రీ అవుతున్న టైం లో థమన్ ఇచ్చిన అప్ డేట్ తో ఫాన్స్ పండగ చేసుకుంటున్నారు.