సమంత అక్కినేని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరాలవుతున్న పేరు. ఆమె పెరఫార్మెన్స్, సమంత గ్లామర్ విషయంలో సోషల్ మీడియాలో నెంబర్ వన్ స్థానంలో ఉండే సమంత.. ఇప్పుడు భర్త నాగ చైతన్య వలన హైలెట్ అవుతుంది. చిరు - సామ్ విడాకుల మేటర్ సోషల్ మీడియాని దావానంలా చుట్టేసింది. ఏది ఏమైనా సమంత మాత్రం ఎప్పటిలాగే తన పనులు తాను చేసుకుపోతుంది. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే సమంత ఎప్పుడు తన గ్లామర్ ఫొటోస్ ని షేర్ చేస్తుంది. తాజాగా సమంత క్యూటీ అండ్ స్వీట్ ఫొటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చెయ్యగా అవి కాస్త వైరల్ అయ్యాయి. బేబీ పింక్ డ్రెస్ లో బాబ్డ్ హెయిర్ స్టయిల్ తో చేతిలో పెద్ద పుస్తకంతో సమంత నిజంగా క్యూట్ గా కనిపిస్తుంది.
ఇక ఈమధ్యన టాలీవుడ్ దూరం పెట్టిన రకుల్ ప్రీత్ కూడా సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టీవ్ గా ఉండే హీరోయిన్. ప్రస్తుతం మనీ లాండరింగ్ కేసులో ఈడీ విచారణను ఎదుర్కుంటున్న రకుల్ ప్రీత్ బాగా సన్నబడి బాలీవుడ్ మూవీస్ తో బిజీగా మారింది. గ్లామర్ గర్ల్ రకుల్.. మరీ పుల్లలా మారింది అనే కామెంట్స్ ని ఏ మాత్రం పట్టించుకొని రకుల్.. తన గ్లామర్ ఫొటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. తాజాగా బ్లాక్ అండ్ వైట్ లో ఉన్న రకుల్ ఫోటో ని షేర్ చెయ్యగా.. అది వైరల్ అయ్యింది. లూజ్ హెయిర్ తో బ్లాక్ స్పెట్స్ తో రకుల్ గ్లామర్ లుక్ సోషల్ మీడియాలో విపరీతంగా పాపులర్ అయ్యింది.